Homeఎంటర్టైన్మెంట్70th Filmfare Awards: 70వ 'ఫిలిం ఫేర్' అవార్డ్స్ లో 'పుష్ప 2' మేనియా..ఉత్తమ నటుడిగా...

70th Filmfare Awards: 70వ ‘ఫిలిం ఫేర్’ అవార్డ్స్ లో ‘పుష్ప 2’ మేనియా..ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్!

70th Filmfare Awards: ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని, ఈ ఏడాది కొచ్చి ప్రాంతం లో గ్రాండ్ గా నిర్వహించారు. సౌత్ ఇండియా కి చెందిన నటీనటులంతా ఈ ఈవెంట్ లో నిన్న రాత్రి తళుక్కుమని మెరిశారు. 2024 వ సంవత్సరానికి గానూ, సంచలన విజయాలు నమోదు చేసుకున్న సినిమాలకు, అందులో నటించిన నటీనటులకు ఈ అవార్డ్స్ ని అందజేశారు. దీనిని 70 వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గా […]

70th Filmfare Awards: ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని, ఈ ఏడాది కొచ్చి ప్రాంతం లో గ్రాండ్ గా నిర్వహించారు. సౌత్ ఇండియా కి చెందిన నటీనటులంతా ఈ ఈవెంట్ లో నిన్న రాత్రి తళుక్కుమని మెరిశారు. 2024 వ సంవత్సరానికి గానూ, సంచలన విజయాలు నమోదు చేసుకున్న సినిమాలకు, అందులో నటించిన నటీనటులకు ఈ అవార్డ్స్ ని అందజేశారు. దీనిని 70 వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గా పిలుస్తున్నారు. ఈ అవార్డ్స్ లో మన టాలీవుడ్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి అత్యధిక అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు ని అందుకోగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అందుకున్నాడు. ‘పుష్ప 2’ చిత్రం లోని పాటలు దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి.

అందుకు దేవిశ్రీ ప్రసాద్ ఈ అవార్డు ని అందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నారు ఆయన అభిమానులు. ఇకపోతే పుష్ప 2 కి దర్శకత్వం వహించినందుకు, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డుని అందుకున్నాడు. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్ క్యాటగిరీ లో ‘హనుమాన్’ చిత్రానికి గానూ తేజ సజ్జ అందుకోగా, ఉత్తమ నటి క్రిటిక్స్ క్యాటగిరీ లో కాజల్ అగర్వాల్ సత్యభామ చిత్రానికి అందుకున్నది. ఇక ఉత్తమ నటి అవార్డు ని నివేత థామస్ (35 చిన్న కథ కాదు’ అనే చిత్రానికి అందుకుంది. అదే విధంగా 80 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నప్పటికీ కూడా, ‘కల్కి’ చిత్రం లో భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించి, ప్రేక్షకులను అబ్బురపరిచిన బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఉత్తమ సహాయనటుడు క్యాటగిరీ లో ఈ అవార్డు సొంతమైంది. అదే విధంగా ‘దేవర’ చిత్రం లో ‘చుట్టమల్లే చుట్టేశావే’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్ కి లిరిక్స్ ని అందించినందుకు రామ జోగయ్య శాస్త్రి ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఆ పాటని ఆలపించిన శిల్ప రావు కి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. అదే విధంగా ‘గుంటూరు కారం’ చిత్రం లో ‘కుర్చీ మడతపెట్టి’ పాటని పాడిన శ్రీ కృష్ణ కి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) క్యాటగిరీలో అవార్డు దక్కింది. అదే విధంగా ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సందీప్ సరోజ్ ‘బెస్ట్ డెబ్యూ మేల్’ క్యాటగిరీ లో సందీప్ సరోజ్ అవార్డుని అందుకోగా, ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన యాదు వంశీ ‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్’ గా అవార్డు ని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ‘గం గం గణేశా) చిత్రం తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నయన్ సారిక ‘బెస్ట్ డెబ్యూ ఫిమేల్’ అవార్డు ని కైవసం చేసుకుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper