Mahesh Babu angry on director: ‘చిరుత’ సినిమాతో తన మార్కు చూపించిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక రెండో సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీరతో టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ ను సైతం తన దక్కించుకుంటాడనెంతలా గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సాధించాయి. ధృవ, రంగస్థలం లాంటి సినిమాలు మాత్రం అతనిలోని నట పొటెన్షియాలిటిని బయటికి తీసి ప్రేక్షకులందరికి రామ్ చరణ్ అంటే ఏంటో చూపించాయి. ఇలా ఇలాంటి సినిమాలను తను ఎప్పుడు చేయాలని తన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మగధీర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయన ఇండస్ట్రీ రికార్డ్ లను సైతం బ్రేక్ చేశాడు.
మగధీర సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా చేశాడు. ఇక మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ లో గుర్రం మీద స్వారీ చేయాల్సి ఉంటుందని త్రివిక్రమ్ చెప్పాడట. దానికి మహేష్ బాబు మగధీర సినిమాలో రామ్ చరణ్ ని చూసి కాపీ చేయమంటావా? అంటూ త్రివిక్రమ్ మీదకి ఫన్నీగా ఒక కామెంట్ చేశారట.
Also Read: అల్లు అర్జున్ ఆ హిట్ మూవీని వదిలేసి ప్లాప్ మూవీ ని చేయడానికి కారణం ఏంటంటే..?
దానికి త్రివిక్రమ్ అవును కదా రీసెంట్గా మగధీర వచ్చింది. మనం అది చేస్తే వాళ్ళని చూసి కాపీ చేశాం అనుకుంటారేమో అని ఒక బైక్ సీక్వెన్స్ అయితే పెట్టారు. మొత్తానికైతే రామ్ చరణ్ ను చూసి కాపీ కొట్టినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు దర్శకుడికి ఒక ఐడియా ఇచ్చి అక్కడ బైక్ ని పెడితే బాగుంటుందని చెప్పారట. ఇక ఈ ఐడియా కూడా మహేష్ బాబుదే కావడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఒక హీరో చేసింది మరొక హీరో వెంటనే చేయడం అభిమానులు చూస్తే బాగుండదు. ఆ హీరో అభిమానులు మా హీరోను చూసి మీ హీరో కాపీ చేశాడు అని ట్రోల్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అలా చెప్పారట. మొత్తానికైతే త్రివిక్రమ్స్ సైతం మహేష్ బాబు మాటని ఫాలో అయ్యాడు…