Mad Square and Robin Hood : సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ కి ది బెస్ట్ సీజన్ గా ఈ ఉగాది సీజన్ ని చెప్పుకోవచ్చు. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఈ సీజన్ లో విడుదల కాలేదని ట్రేడ్ చాలా ఫైర్ మీద ఉంది. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ, షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మే9 కి వాయిదా పడింది. హరి హర వీరమల్లు తప్పుకోవడం తో మార్చి 28న రాబిన్ హుడ్(Robin Hood Movie) తో పాటు, మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) చిత్రం కూడా విడుదలైంది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి విడుదలకు ముందు నుండే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో, టాక్ కాస్త యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ మంచి ఓపెనింగ్ వసూళ్లను సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వచ్చిందంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
Also Read : ‘రాబిన్ హుడ్’ మూవీ ట్విట్టర్ టాక్..ఈ రేంజ్ అసలు ఊహించలేదుగా!
మరోపక్క నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రానికి మాత్రం కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందంటే, ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఉగాది ఎలాగో కలిసి రాలేదు, కనీసం రంజాన్ రోజు అయినా కలిసి వస్తుందేమో అని ఆశపడ్డారు ఈ సినిమాని కొన్న బయ్యర్స్. కానీ రంజాన్ రోజున ఈ చిత్రానికి కేవలం 14 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి అంటే, ఎలాంటి పరిస్తితులౌ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి రంజాన్ రోజున దాదాపుగా 91 వేల టిక్కెట్లు బుక్ వై షో యాప్ లో అమ్ముడుపోయాయి. ఈ రెండు సినిమాల మధ్య ఏ రేంజ్ తేడా ఉందో మీరే గమనించండి.
ఇక పండగలు అయిపోయాయి, ఏప్రిల్ 6 న శ్రీ రామ నవమి. అప్పటి వరకు ఈ రెండు చిత్రాలు అసలైన పరీక్షలు ఎదురుకోబోతున్నాయి. కచ్చితంగా రాబిన్ హుడ్ మీద మ్యాడ్ స్క్వేర్ భారీ లీడింగ్ తో ఉంటుంది అనుకోండి, కానీ మ్యాడ్ స్క్వేర్ 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక రాబిన్ హుడ్ విషయానికి వస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 28 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని అయినా రాబడుతుందో లేదో చూడాలి. ఇంతటి ఘోరమైన డిజాస్టర్ నితిన్ కెరీర్ లో మళ్ళీ గట్టిగా ప్లాన్ చేసుకున్నా రాదేమో అని ట్రేడ్ పండితులు అంటున్నారు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్విట్టర్ టాక్..సెకండ్ హాఫ్ తేడా కొట్టేసింది!