IPL
IPL : ఇక ప్రస్తుత సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్ కతా తొలి మ్యాచ్ బెంగళూరు (Royal challengers Bangalore) జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో కోల్ కతా ఓటమిపాలైంది. సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా ఓడిపోవడం విశేషం. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా కోల్ కతా మళ్ళీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. ముంబై బౌలర్ల ధాటికి 116 పరుగులకే కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్.. 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 117 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేదించింది.
Also Read : 250+ స్కోర్ చేయకపోతే ట్రోల్స్ తప్పవా.. భారీ అంచనాలే SRH కొంప ముంచాయా?
చెత్త రికార్డు
ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. మరో చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది. ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ పదిసార్లు ఓటమిపాలైంది. కింగ్స్ 11 పంజాబ్ కోల్ కతా లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ పై 9సార్లు ఓటములు ఎదుర్కొంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి పై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా కింగ్స్ 11 పంజాబ్ ఉండేది. అయితే ఈ రికార్డును ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ బద్దలు కొట్టింది. ముంబై ఇండియన్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 24 సార్లు ఓటమిపాలైంది. ఒకే ప్రత్యర్థి జట్టుపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. ఇక ప్రస్తుత ఓటమితో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్లు ఆడి.. ఒక దాంట్లో గెలిచి.. రెండిట్లో ఓడిపోయి..-1.428 నెగిటివ్ రన్ రేట్ తో చివరి స్థానంలో ఉంది. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. బలమైన జట్లను సైతం ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో దుర్భేద్యమైన బ్యాటింగ్గ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.. అయితే ఈ సీజన్లో మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేక పోతోంది.. ప్రత్యర్థి జట్ల ముందు తల వంచుతోంది.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త IPL టీం..? సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఉండదా?