https://oktelugu.com/

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్విట్టర్ టాక్..సెకండ్ హాఫ్ తేడా కొట్టేసింది!

Mad Square : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది.

Written By: , Updated On : March 28, 2025 / 08:35 AM IST
Mad Square

Mad Square

Follow us on

Mad Square : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ప్రతీ ఒక్కటి ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. బుక్ మై షో యాప్ లో నిన్న ఒక్కరోజే 75 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ కి 2 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. ప్రీమియర్స్ ముగిసేసమయానికి నాలుగు లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ రేంజ్ బజ్ ని ఏర్పాటు చేసిన ఈ సినిమాకు, సోషల్ మీడియా లో ఎలాంటి టాక్ వచ్చింది?, ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

Also Read : తెలుగువాళ్లు గలీజ్ వాళ్ళా..? ‘మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ ఉద్దేశ్యం ఏమిటి?

ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఈ చిత్రం ‘మ్యాడ్’ కి సీక్వెల్ లాగా అనిపించలేదు, జాతి రత్నాలకు సీక్వెల్ లాగా అనిపించింది. ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు పంచులే పంచులు, నవ్వులే నవ్వులు. మీ స్నేహితులతో కలిసి ఈ సినిమాకు వెళ్తే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారని చూసిన ప్రతీ ఒక్కరు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడం లో సక్సెస్ అయ్యాడు. ఇటీవల కాలం లో ఆడియన్స్ ఇంతలా ఒక సినిమాకు నవ్వుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ ఫస్ట్ కి వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ సెకండ్ హాఫ్ కి మాత్రం రాలేదు. మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు సినిమా ఫ్లో ని కాస్త దెబ్బ తీశాయి, కొన్ని చోట్ల సాగదీత ఎక్కువైందని చూసిన వాళ్ళు అంటున్నారు. కానీ కామెడీ పరంగా మాత్రం అనేక సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో కూడా అదిరిపోయాయి అని అంటున్నారు నెటిజెన్స్.

ఓవరాల్ గా ట్విట్టర్ నుండి వస్తున్న టాక్ ఏమిటంటే బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్, అబోవ్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఓవరాల్ గా సూపర్ హిట్ సినిమా అని అంటున్నారు. సమ్మర్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం, దానికి తోడు ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి కూడా తోడైంది, ఈ మాత్రం టాక్ పబ్లిక్ లో కూడా ఉంటే మన టాలీవుడ్ కి మరో వంద కోట్ల గ్రాస్ సినిమా వచ్చేసినట్టే. కేవలం మొదటి వారం లోనే 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ కి మరో జాక్పాట్ ఈ చిత్రం ద్వారా తగిలినట్టే, చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనేది.

Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ లో హైలెట్స్, ప్రధాన లోపాలు ఇవే…