Homeఎంటర్టైన్మెంట్Love Story USA Bookings: 61 లొకేషన్స్ లో 157 ప్రీమియర్...

Love Story USA Bookings: 61 లొకేషన్స్ లో 157 ప్రీమియర్ షోలు !

Love Story USA Bookings: 157 Premiere Shows In 61 Locations

Love Story USA Bookings: సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా రానున్న సినిమా ‘లవ్ స్టోరీ’. కాగా ‘యూఎస్ఏ’ లో ఈ సినిమా బుకింగ్స్ హడావుడి బాగా కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఏ లో మొత్తం 61 లొకేషన్స్ లో 157 ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి.

కాగా సెప్టెంబర్ 23న నుంచి ఈ షోలు స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లవ్ స్టోరీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి బాగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటికే బయ్యర్లు కూడా ఈ సినిమా పై మంచి నమ్మకంతో ఉన్నారు. అటు ప్రేక్షకుల్లోనూ ముఖ్యంగా యూత్ లో ఈ చిత్రం పై బాగా ఆసక్తి నెలకొంది. సినిమాలో సాయి పల్లవి – చైతు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందట. పైగా శేఖర్ కమ్ముల ‘ఫిదా’ లాంటి సంచలన విజయం తర్వాత చేస్తున్న సినిమా ఇది.

కాబట్టి ఈ సినిమా విజయం తాలూకు పాజిటివ్ బజ్ కూడా ఈ సినిమా పై బాగా ఉంటుంది. అన్నిటికీ మించి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇష్టమైన డైరెక్టర్ నుంచి వస్తోన్న సినిమా కూడా. బలమైన ఎమోషనల్ కథలతో ఫీల్ గుడ్ చిత్రాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది.

అందుకే లవ్ స్టోరీ నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా వందలాది చిత్రాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుండటం విశేషం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular