Akkineni Nagarjuna: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేచిపోయే వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ఈమధ్య కాలం లో చూడని భారీ ఓపెనింగ్ వసూళ్లు ఈ చిత్రానికి దక్కాయి. చాలా కాలం తర్వాత సక్సెస్ వచ్చేలోపు అక్కినేని అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. గత రెండు మూడు రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మూవీ టీం సక్సెస్ టూర్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది. ఇదంతా పక్కన పెడితే నేడు హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ లో ఆయన ఎంతో ఆనందంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి ‘సక్సెస్ మీట్ కి వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా విడుదల రోజు మేము ఢిల్లీ లో ప్రధాని మోడీ గారిని కలవడానికి వెళ్ళాము.నాగ చైతన్య తొందరగానే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక ఫోన్స్ అనుమతించరు కాబట్టి, సినిమాకి టాక్ ఏమని వచ్చిందో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉండేది. బయటకి వచ్చి ఫోన్ చూసిన తర్వాత నాన్ స్టాప్ గా మెసేజిలు వస్తూనే ఉన్నాయి. మా కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా, అక్కినేని అభిమానులు ఈ సినిమా విజయం పై ఎంతో ఆనందిస్తున్నారు. అల్లు అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు. 100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇప్పుడు తండేల్..అన్ని చిత్రాలు ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్స్ ని ఇచ్చారు మాకు..మీకు రుణపడి ఉంటాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
నాగ చైతన్య గురించి మాట్లాడుతూ ‘షూటింగ్ కి వెళ్లొచ్చి చాలా అలిసిపోయేవాడు. ప్రతీరోజు ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. నేను అడిగేవాడిని, ఏంట్రా చాలా కష్టంగా అనిపిస్తుందా షూటింగ్ అని, అవును నాన్న, చాలా కష్టం గా ఉంది. జాలరుల బాధలు ఎలా ఉంటాయో అర్థమైంది. కొన్నిరోజులకే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు నెలల తరబడి సముద్రం లో వేట ఎలా చేస్తున్నారో, ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోగలను అని చెప్పాడు. నిజంగా వాళ్లందరికీ సెల్యూట్..నాగ చైతన్య క్లైమాక్స్ లో ఒక్కటే కాదు. సినిమా మొత్తం చాలా అద్భుతంగా నటించాడు. అనేక సనార్భాల్లో వాడిని చూసిన తర్వాత నాకు మా నాన్న గారిని మళ్ళీ వెండితెర మీద చూసినట్టు అనిపించింది’ అంటూ నాగార్జున ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నాగార్జున లో ఇంత ఎమోషన్ ని చూసి అభిమానులు చాలా కాలం అయ్యింది.