Thandel Movie: సంక్రాంతి సినిమాల తర్వాత ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన చిత్రాలలో ఒకటి ‘తండేల్’. ఈ చిత్రంలోని పాటలు,ట్రైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా బుజ్జి తల్లి పాట వినిపిస్తూనే ఉండేది. అలా భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గడిచిన ఐదేళ్ల నుండి అక్కినేని ఫ్యామిలీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ చూసింది. ఆ ఫ్లాప్స్ నుండి ‘తండేల్’ చిత్రం బయటపడేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నాగ చైతన్య ఇప్పటి వరకు చూడని వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో అల్లు అర్జున్ కూడా ఒకడు అని చెప్పొచ్చు.
సినిమా చూసిన ప్రతీ ఒక్కరు బయటకి వచ్చిన తర్వాత నాగ చైతన్య పెర్ఫార్మన్స్ ని ఎంతగా మెచ్చుకున్నారో, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని కూడా అంతే మెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడింది అంటే అందుకు కారణం వీళ్ళిద్దరే అని ఆడియన్స్ ముక్త కంఠం తో చెప్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనే అయోమయం లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ ని సలహా అడగగా, లవ్ స్టోరీస్ కి దేవి శ్రీ ప్రసాద్ రేంజ్ లో సంగీతం ఎవ్వరూ అందించలేరు, ఆయన్ని తీసుకోండి అని చెప్పాడంటూ అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఈ విషయం లో పట్టుబట్టడం తో అల్లు అరవింద్ దేవిశ్రీ ప్రసాద్ ని అడగడం, ఆయన వెంటనే ఒప్పుకొని ఈ చిత్రానికి పని చేయడం వంటివి జరిగాయి.
ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. ఆ విధంగా అల్లు అరవింద్ కి మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో సరైన సలహా ఇచ్చి పరోక్షంగా ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. త్వరలోనే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది. జనవరి నెలలో సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ ని చూసి లాభాలను మూటగట్టుకున్న ట్రేడ్, ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ‘తండేల్’ చిత్రం తో మరో భారీ సక్సెస్ ని అందుకొని లాభాల్లో మునిగి తేలుతున్నారు. మరోపక్క మూవీ టీం మొత్తం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్స్ కి వెళ్లి అక్కడి ఆడియన్స్ తో కలిసి ఎంజాయ్ చేయబోతున్నారు.