Sai Pallavi: ఆ మధ్య సాయి పల్లవి కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, వివాహం చేసుకోబోతుందని కథనాలు వెలువడ్డాయి. అలాగే ఆమె డాక్టర్ వృత్తిలో కొనసాగాలని అనుకుంటుందని కూడా పుకార్లు వినిపించాయి. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. అందుకే గ్యాప్ వచ్చిందని సాయి పల్లవి సమాధానం చెప్పింది. ఆమె లేటెస్ట్ తెలుగు మూవీ తండేల్. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా సూపర్ హిట్ అయ్యింది. నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం.
Also Read: టీమిండియా గెలిచిన ఊపులో..వీళ్ళను మర్చిపోయాం..ఇందులో మన ఇండియన్ కూడా ఉన్నాడు..
గతంలో లవ్ స్టోరీ చిత్రంతో ఈ జంట అలరించారు. తండేల్ మూవీతో సాయి పల్లవికి తెలుగులో గ్రేట్ కమ్ బ్యాక్ లభించింది. సాయి పల్లవి బాలీవుడ్ లో బిజీ అవుతుంది. ప్రస్తుతం రెండు హిందీ చిత్రాల్లో సాయి పల్లవి నటిస్తుంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ఏక్ దిన్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జపాన్ లో జరిపినట్లు సమాచారం. సాయి పల్లవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రామాయణ పార్ట్ 1. రన్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ఐకానిక్ రోల్ సీత గా నటించే అదృష్టం సాయి పల్లవికి దక్కింది.
రామాయణ చిత్రీకరణ దశలో ఉంది. రెండు మూడు భాగాలుగా రామాయణ విడుదల కానుంది. తండేల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి తన కజిన్ వివాహ వేడుకలో సందడి చేసింది. తమ్ముడు పెళ్ళిలో బంధువులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసింది. సాయి పల్లవి నీలి రంగు చీర ధరించి చాలా సింపుల్ గా పెళ్ళికి హాజరైంది. తమ్ముడి పెళ్ళిలో డాన్స్ చేస్తున్న సాయి పల్లవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా సాయి పల్లవి చాలా ప్రత్యేకం అంటున్నారు.
సాయి పల్లవికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా ఖన్నా. చెల్లులు పూజా ఖన్నా వివాహంలో సాయి పల్లవి డాన్స్ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. పూజా ఖన్నా ఒక చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్ లో సాయి పల్లవి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. డీగ్లామర్ హీరోయిన్స్ అక్కడ నెట్టుకు రావడం అంత సులభం కాదు.
View this post on Instagram