Homeఎంటర్టైన్మెంట్Surya's Aakaasam Nee Haddhu Ra: క్లాసిక్ రీమేక్ లో మార్పులు.. మరి హీరో...

Surya’s Aakaasam Nee Haddhu Ra: క్లాసిక్ రీమేక్ లో మార్పులు.. మరి హీరో ఎవరో ?

Surya’s Aakaasam Nee Haddhu Ra: తమిళ స్టార్ హీరో సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ అంటూ ఒక గ్రేట్ ఎమోషనల్ డ్రామాగా సినిమాని మలిచి మొత్తానికి తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంది దర్శకురాలు సుధ కొంగర. ఇక ఈ చిత్రం సూర్య సినీ కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచి పోవడమే కాకుండా.. చాలా కాలం తర్వాత సూర్యకి నిజమైన హిట్ ను అందించింది ఈ సినిమా.

పైగా ఈ సినిమాలోని కంటెంట్ సూర్యకి మరియు సుధ కొంగరకు అదనపు గౌరవాన్ని కూడా తెచ్చి పెట్టింది. అలాగే గతేడాది డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదలైన ఈ మూవీ, ఇప్పటికే రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుంటూ ఓటీటీలోనే బిగ్గెస్ట్ సౌత్ హిట్ ఫిల్మ్ గా కూడా నిలవడం విశేషం.

మొత్తానికి ఈ సినిమా పట్ల సౌత్ ప్రేక్షకుల స్పందన చూసిన అమెజాన్ సంస్థ.. ఆ మధ్య ఈ సినిమా టీమ్ కి ప్రత్యేక గిఫ్ట్ లు కూడా అందించింది అంటే.. నిజంగా ఇది కచ్చితంగా చెప్పుకోతగ్గ అంశమే. అయితే, ఈ సినిమా ఇంత గొప్ప హిట్ అవ్వడానికి సుధా కొంగర దర్శకత్వ పనితనమే.

అందుకే, సుధ కొంగర దర్శకత్వంలో హీరో సూర్య, రాజశేఖర్ పాండియన్ తో కలిసి ఈ సినిమాని హిందీలోకి భారీ స్థాయిలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా సుధ కొంగర హిందీ వెర్షన్ లో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ట్రెండ్ ను బట్టి, సుధ కొంగర కథలో కొత్త పాత్రలను యాడ్ చేసిందట.

కాగా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. హీరో ఎవరనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular