https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా?

ఆలస్యం అమృతం విషం.. అన్నట్లుగా తయారైంది ‘ఆర్ఆర్ఆర్’ పరిస్థితి. దర్శకధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీజైన ఓ వీడియోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ మూవీపై జనాల్లో క్రమంగా ఇంట్రెస్ట్ తగ్గుతుందా? అన్న అనుమానాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 12:00 PM IST
    Follow us on

    ఆలస్యం అమృతం విషం.. అన్నట్లుగా తయారైంది ‘ఆర్ఆర్ఆర్’ పరిస్థితి. దర్శకధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీజైన ఓ వీడియోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ మూవీపై జనాల్లో క్రమంగా ఇంట్రెస్ట్ తగ్గుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

    Also Read: బిగ్ బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

    అయితే ఇందుకు అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే సినిమా రిలీజు విషయంలో చిత్రయూనిట్ పలుసార్లు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ సినిమా రిలీజుపై చిత్రయూనిట్ కే క్లారిటీ లేదని తెలుస్తోంది. ఓసారి సంక్రాంతి అని.. ఓసారి దసరా అని.. మరోసారి వేసవి అంటూ పోస్టు చేస్తూ పోతున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైయ్యాయి.

    దీనికితోడు ఆర్ఆర్ఆర్ నుంచి భీమ్ ఫర్ సీతరామరాజు పేరుతో రాంచరణ్ పై ఓ టీజర్ రిలీజ్ చేశారు. రాంచరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ అదిరిపోయింది. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం రాజమౌళి అలా చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కేవలం విషెస్ తో సరిపెట్టడం నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

    తాజాగా ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు చిత్రయూనిట్ ఓ చిన్న వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. కొమురంభీం పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తారని అభిమానులు అనుకుంటే తీరా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి షూటింగు ప్రారంభమైందని.. ఇదేదో గొప్పవిషయం అంటూ చిత్రయూనిట్ చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఈ వీడియోపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

    Also Read: ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్ ఇదే

    ఈ వీడియోకు గట్టిగా రెండు మిలియన్ల వ్యూస్ రాలేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై జనాల్లో ఇంట్రెస్ట్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే రాజమౌళికి ఇది మింగుపడని విషయం. దీంతో రాజమౌళి మున్ముందు సినిమాపై ఎలాంటి క్రేజ్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.