https://oktelugu.com/

వైసీపీ నేతలకు షాక్.. హైకోర్టు సంచలన నిర్ణయం

అనుకున్నట్టే జరిగింది.. జడ్జీలపై సోషల్ మీడియాతోపాటు వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై  హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విశేషం ఏంటంటే.. హైకోర్టు ఆదేశాలకు జగన్ సర్కార్ కూడా సై అనడం విశేషం. దీంతో ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఏపీ హైకోర్టు తీర్పులు.. వాటిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల విషయంలో హైకోర్టు  నిర్ణయంతో రాజకీయ వేడి రాజుకుంది. Also Read: సీఎం జగన్‌కు కేసుల ఉచ్చు? ఏం జరగనుంది..? న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో, […]

Written By: , Updated On : October 9, 2020 / 11:54 AM IST
Follow us on

అనుకున్నట్టే జరిగింది.. జడ్జీలపై సోషల్ మీడియాతోపాటు వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై  హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విశేషం ఏంటంటే.. హైకోర్టు ఆదేశాలకు జగన్ సర్కార్ కూడా సై అనడం విశేషం. దీంతో ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఏపీ హైకోర్టు తీర్పులు.. వాటిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల విషయంలో హైకోర్టు  నిర్ణయంతో రాజకీయ వేడి రాజుకుంది.

Also Read: సీఎం జగన్‌కు కేసుల ఉచ్చు? ఏం జరగనుంది..?

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో, బయట వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ కేసులను సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వతంత్ర్య సంస్థగా సీబీఐ ఉందని.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నాయని.. తదితర కారణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది. ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని.. దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్డు అభిప్పాయపడింది. అలాగే సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక న్యాయమూర్తులపై దూషణల కేసును సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అడ్వకేట జనరళ్లు హైకోర్టుకు నివేదించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. అలాంటి వాటిని ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: పంచితే సరిపోదు.. అభివృద్ధి సంగతేంది జగన్‌?

ఏపీ హైకోర్టు తీర్పులపై కొద్దిరోజులుగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారం సైతం హైకోర్టు తీర్పులపై కామెంట్ చేశాడు. ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యి కేసులు పెట్టమని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై రిజిస్ట్రార్ ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిన్న ప్రశ్నించింది. నేతలను రక్షించేందుకే కేసు పెట్టలేదా అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.అటు స్పీకర్ తమ్మినేని ఎక్కడ నుంచి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రభుత్వ లాయర్ ను కోరింది. ఈ విషయంలో సీఐడీ విఫలమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామంది. అనంతరం తీర్పును నిన్న హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. తాజాగా సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.