https://oktelugu.com/

అనిల్ అంబానీ జైలుకు పోకుండా ముఖేష్ అంబానీ సాయం చేయలేదా?

రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ నుంచి ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ, ముఖేశ్‌ అంబానీ ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో ముఖేశ్‌ అంబానీ జియో కమ్యూనికేషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ జియో కమ్యూనికేషన్‌ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. గ్రామాల స్థాయి వరకూ ఇప్పుడు ఇంటర్నెట్‌ చేరిందంటే ఆ క్రెడిట్‌ జియోదే అని చెప్పాలి. అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్‌ అంబానీ కోట్లకు పడగలెత్తారు. అపర కుబేరుడిగా ఘనత సాధించారు. ప్రపంచ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 12:32 PM IST
    Follow us on

    రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ నుంచి ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ, ముఖేశ్‌ అంబానీ ఏళ్ల క్రితమే విడిపోయారు. దీంతో ముఖేశ్‌ అంబానీ జియో కమ్యూనికేషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ జియో కమ్యూనికేషన్‌ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. గ్రామాల స్థాయి వరకూ ఇప్పుడు ఇంటర్నెట్‌ చేరిందంటే ఆ క్రెడిట్‌ జియోదే అని చెప్పాలి. అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్‌ అంబానీ కోట్లకు పడగలెత్తారు. అపర కుబేరుడిగా ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో నిలిచారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడిగానూ కొనసాగుతున్నారు.

    Also Read: బిజెపి కి తూర్పు గాలి వీస్తుంది

    మరో వైపు ఆయన తమ్ముడు.. వ్యాపారవేత్త అనిల్ అంబానీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయి.. వ్యాపారాలు నష్టపోయి జీరోగా మిగిలిపోతున్నాడు. మూడు చైనా బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్లోని యుకే కోర్టుకు హాజరయ్యారు. అనిల్ అంబానీ యొక్క మొత్తం అప్పులు 716,917,681 డాలర్లు (రూ .5,281 కోట్లు) మేరకు పేరుకుపోయాయి. యుకే కోర్టుకు హాజరైన అనిల్ అంబానీ మాట్లాడుతూ ప్రస్తుతానికి తన వద్ద అప్పు చెల్లించడానికి ఏమీ లేదని వాపోయాడు.ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం నా భార్య భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల్లో చట్టపరమైన ఖర్చుల కోసం 9 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కూడా విక్రయించానని పేర్కొన్నాడు.

    అయితే గత ఏడాది ఎరిక్సన్ బకాయిల కేసులో అనిల్ అంబానీకి కోర్టు సొమ్ములు కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. 2019, మార్చి 18న స్వీడన్ టెలికాం కంపెనీకి రూ.458.77 కోట్ల బకాయిలను చెల్లించకపోతే అనిల్ అంబానీ జైలుకు వెళ్లాల్సి ఉండేది. ఆ సందర్భంలో అనిల్ అంబానీకి అన్న ముఖేష్ అంబానీ అండగా నిలిచాడని.. ఆ సొమ్ము చెల్లించాడని వార్తలు వచ్చాయి. అనిల్ అంబానీ కూడా ట్విట్టర్ లో అన్నకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. ముఖేష్ అంబానీ తన తమ్ముడైన అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా వందల కోట్లను సాయం చేశాడని పరిశ్రమ వర్గాల్లో ఓ టాక్ ఉంది. అయితే తాజాగా తమ్ముడికి ఆర్థికంగా సాయం చేయలేదని తేలింది.

    అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం)కు చెందిన కార్పొరేట్ ఆస్తులను ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.460 కోట్లు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తమ్ముడు అనిల్ కు ఈ లీజు ద్వారా బకాయిలను అన్న చెల్లించారు.

    Also Read: రెండో అతిపెద్ద కంపెనీగా టాటా కన్సల్టెన్సీ

    అయితే ఎరిక్సన్ కేసులో జైలుకు వెళ్లకుండా ముఖేష్ అంబానీ నుంచి అనిల్ కు నిధులు రాలేదని చెబుతున్నారు. ఏడాదిన్నర తర్వాత అనిల్ అంబానీ ఆర్.కామ్ గ్రూప్ అధికార ప్రతినిధి మాత్రం కార్పొరేట్ ఆస్తుల లీజింగ్ ద్వారా బకాయిలు చెల్లించినట్లు చెబుతున్నారు. అనిల్ అంబానీని ఆర్థిక ఉచ్చు నుండి కాపాడినప్పటికీ అది బిజినెస్ కోణంలోనే అని అభిప్రాయపడుతున్నారు. ఇరువురు అన్నాదమ్ముల మధ్య సంబంధాలు అంత బాగా లేవని అంటున్నారు. దీన్ని బట్టి తమ్ముడు జైలుకు వెళ్లకుండా అన్న దాదాపు 458 కోట్లు బకాయిలు సొంత ఖర్చుపై చెల్లించాడన్నది అబద్ధమని తేలింది. అనిల్ అంబానీకి ముఖేష్ ఆ సాయం చేయలేదని స్పష్టమైంది.