spot_img
Homeఎంటర్టైన్మెంట్LIK 4 days box office collection : LIK' 4 రోజుల వరల్డ్ వైడ్...

LIK 4 days box office collection : LIK’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఫ్లాప్ టాక్ తో 60 శాతం కి పైగా రికవరీ..

LIK 4 days box office collection : ఫ్లాప్ టాక్ తో డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఈమధ్య కాలం లో సాధ్యపడని విషయమిది. అలాంటిది నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , రీసెంట్ గా తన నుండి విడుదలైన ‘LIK ‘ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, 4 రోజుల్లో 60 శాతం రీకవరీ అయ్యేలా చేశాడు. అందుకు కారణం మొదటి మూడు చిత్రాలతో ఆయన యూత్ ఆడియన్స్ లో క్రియేట్ చేసుకున్న నమ్మకమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా కాబట్టి , వీకెండ్ వరకు మంచి వసూళ్లను రాబట్టి , ఆ తర్వాత బాగా డౌన్ అయిపోతుందని అనుకున్నారు. కానీ నాల్గవ రోజున కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది.

కేవలం ఒక్క బుక్ మై షో యాప్ లోనే ఈ చిత్రానికి నాల్గవ రోజున 55 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వర్కింగ్ డే రోజున, ఫ్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాకు ఈ రేంజ్ ట్రెండ్ సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి నాల్గవ రోజున ఏకంగా 4 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. షేర్ వసూళ్లు దాదాపుగా 2 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 1 కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్రా + సీడెడ్ నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ వీకెండ్ లోపు మరో 2 నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని అర్థం తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే , తమిళనాడు నుండి 21 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక రాష్ట్రము నుండి 2 కోట్ల 70 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి రూపాయిలు, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు + తమిళ వెర్షన్స్ కి కలిపి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version