Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan on TV: టీవీ ఛానల్ లో 'జన నాయగన్ ' ప్రదర్శన.. నిర్మాతకు...

Jana Nayagan on TV: టీవీ ఛానల్ లో ‘జన నాయగన్ ‘ ప్రదర్శన.. నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ..

Jana Nayagan on TV: తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్'(Jana Nayagan Movie) విడుదలకు ముందే సోషల్ మీడియా లో లీక్ అవ్వడం ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లోని సన్నివేశాలు సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందాయి. అసలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాక, నిర్మాతలు అష్టకష్టాలు పడుతుంటే , ఇప్పుడు ఆ నిర్మాతకు ఈ అదనపు భారం కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. పోలీసులు రీసెంట్ గానే ఈ సినిమా లీక్ కి కారణమైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అంతే కాకుండా, సోషల్ మీడియా లో దాదాపుగా 300 కి పైగా పైరసీ లింకులను తొలగించారు. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమా తమిళనాడు లోకల్ కేబుల్ టీవీ లో ప్రసారం అవ్వడం సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు లోని కోయంబత్తూరు ప్రాంతానికి సంబంధించిన రాశీ కేబుల్ నెట్వర్క్ లో ఈ సినిమా ప్రదర్శితమైంది. దీనిని గుర్తించిన పోలీసులు ఆ లోకల్ ఛానల్ నెట్వర్క్ ని నడుపుతున్న పళని స్వామిని అరెస్ట్ చేశారు. ఇది తెలుసుకున్న విజయ్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ లో లీక్ అయిన సినిమా, బయటకు రాకుండా ఆగదు. ఈపాటికి ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని అత్యధిక శాతం మంది చూసేసి ఉంటారు. థియేటర్స్ లో విడుదల చేస్తే కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు, విజయ్ అభిమానులు తప్ప , ఎవ్వరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకైన వెంటనే సినిమాని వారం లోపు విడుదల చెయ్యాలి.

కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు చెప్పినట్టుగానే, సినిమాలో చెయ్యాల్సిన మార్పులు మొత్తం చేసి ఫైనల్ ఎడిట్ ని సెన్సార్ కి పంపించారు మేకర్స్. అయినప్పటికీ కూడా ఎదో ఒక సాకుతో సెన్సార్ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు. ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర నే అని అంటున్నారు ఫ్యాన్స్. ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాత ప్లాన్. కానీ ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు. మే నెలలో కూడా విడుదల కాకుంటే , ఇక ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేసి వృధా, నేరుగా ఓటీటీ లోనే విడుదల చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. గతం లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం కూడా ఇలాగే విడుదలకు ముందు సినిమా లీక్ అయితే, నిర్మాతలు కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది . కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేకపోవడం గమనార్హం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version