Anil Ravipudi- Balakrishna: నట సింహం బాలయ్యతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మొత్తం ఏడు ఫైట్స్ ఉన్నాయి.

ఒక్కో ఫైట్ రెండు నిమిషాల పాటు ఉంటుందట. సహజంగా అనిల్ రావిపూడి కామెడీ పెట్టింది పేరు. మరి బాలయ్య అనే సరికి ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ అయితే, ఏకంగా ఐదు నిమిషాల పాటు అనిల్ రావిపూడి డిజైన్ చేశాడట. అసలు బాలయ్య సినిమా అంటేనే యాక్షన్. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో కనీసం నలభై నిమిషాలకు పైగా బాలయ్య ఫైట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అందుకే, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రిస్క్ లేకుండా యాక్షన్ కొట్టుడు వైపే ఆసక్తి చూపిస్తున్నాడు. నిజానికి అనిల్ రావిపూడి – బాలయ్య కలయికలో ఈ రేంజ్ లో ఫైట్లు ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేయలేదు. కామెడీకి బదులు యాక్షన్ ఎక్కువ ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఎలా వస్తారు ? అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. బాలయ్య నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫైట్లే ఎక్స్ పర్ట్ చేస్తారు.

కాకపోతే అనిల్ రావిపూడి కి కామెడీ డైరెక్టర్ ఇమేజ్ ఉంది. కానీ, అక్కడ ఉంది.. బాలయ్య. డైరెక్టర్లతో సంబంధం లేదు. ఇప్పటివరకు బాలయ్యతో సినిమా తీసిన ఏ దర్శకుడూ.. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగానే సినిమా చేశారు. దాన్నే ఫాలో అవుతున్నాడు అనిల్. ఏది ఏమైనా మొదటి నుంచి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకే, ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు పెట్టబోతున్నారు. దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఒక విధంగా బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు. పైగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ హీరో రవితేజ అని, లేదు.. నవీన్ పోలిశెట్టి అని కొన్ని రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా పై ఫుల్ క్రేజ్ ఉంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Prabhas- Minister Roja: మొగల్తూరులో హీరో ప్రభాస్ తో మంత్రి రోజా సీక్రెట్ మీటింగ్
[…] […]