spot_img
Homeఎంటర్టైన్మెంట్Krishnam Raju- Kota Srinivasa Rao: ఆ గొప్ప నటుడికి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది...

Krishnam Raju- Kota Srinivasa Rao: ఆ గొప్ప నటుడికి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది కృష్ణంరాజుగారే.. ఇది రెబల్ స్టార్ గొప్పతనం అంటే

Krishnam Raju- Kota Srinivasa Rao: కృష్ణంరాజుగారు చాలా మంచి వ్యక్తి. ఆయన తోటి నటీనటులకు కూడా ఎంతగానో సాయం చేసేవారు. కోట శ్రీనివాస రావుకి కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. కోట సినిమాల్లోకి కొత్తగా వచ్చిన రోజులు అవి. అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. సహజంగా డేట్లు, ప్రొడక్షన్‌ వ్యవహారాలు, మేనేజర్లు ఇలా చాలా ఉంటాయని కోట శ్రీనివాసరావుకి తెలియదు. ఒకపక్క నటుడిగా పేరు తెచ్చుకుంటున్నా.. మిగిలిన విషయాలు ఆయనకు వంటబట్టలేదు. కాల్షీట్లు గురించి అయితే అసలేమీ తెలిసేది కాదు. ఎక్కడ షూటింగ్‌ ఉందంటే అక్కడికి వెళ్లేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే.. ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకోవాలో కూడా అర్ధమయ్యేది కాదు.

Krishnam Raju- Kota Srinivasa Rao
Krishnam Raju- Kota Srinivasa Rao

 

అయితే, ఓ రోజు హీరో కృష్ణంరాజుగారి గోపీకృష్ణా ఆఫీసుకు వెళ్లారు కోట. అప్పటికే ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి 12 రోజులు పాటు పనిచేశారు. కృష్ణంరాజుగారు బ్రదర్‌ సూర్యనారాయణరాజు, కోట శ్రీనివాసరావును చూడగానే.. ఆఫీసు బోయ్‌ చేత మర్యాదలు చేయించి కూర్చోపెట్టారు. ఆ రోజుల్లో అతిథులను సత్కరించడంలో కృష్ణంరాజు బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌ పెట్టింది పేరు. సూర్యనారాయణరాజు లెక్కలు చూస్తూ..‘చెప్పండి, శ్రీనివాసరావు గారు. 12 రోజులు పని చేశారు. ఎంత ఇవ్వమంటారు ?’ అని అడిగారు. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ మొహమాట పడుతూ కూర్చున్నాడు కోట.

అంతలో అక్కడికి వచ్చిన కృష్ణంరాజు గారు కోట శ్రీనివాసరావుని చూసి..’హా.. శ్రీనివాసరావు.. ఏమిటి ఇలా వచ్చావ్ ? అందరూ బాగా చేస్తున్నావని చెబుతున్నారు’ అంటూ చెప్పుకుంటూ పోతున్నారు. కోట ఆలోచనలు మాత్రం ‘రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలి ?’ అన్న దగ్గరే ఆగిపోయాయి. అది గమనించిన కృష్ణంరాజు ‘మొహంలో ఆలోచనలు.. దేని గురించి’? పక్కన సూర్యనారాయణరాజు చెబుతూ ‘మన తాండ్ర పాపారాయుడు సినిమాకి ఇంతవరకూ ఏమి ఇవ్వలేదు. ఎంత ఇవ్వాలి అని అడుగుతుంటే.. అదుగో అలా నసుగుతున్నాడు’.

Krishnam Raju- Kota Srinivasa Rao
Krishnam Raju

ఆ మాటకి కృష్ణంరాజు నవ్వి.. ‘ఏమిటయ్యా కోట, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అడిగితేనే ఇవ్వరు, అలాంటిది ఇలా నసుగుతూ ఉంటే ఇక నలిపేస్తారు.. జాగ్రత్త. డబ్బులు అడిగి తీసుకోవాలయ్యా’. ఆ మాటలకూ కోట ఇబ్బందిగా ‘అది గాదు సర్, నేను కొత్త కదా, ఏ వేషానికి ఎంత తీసుకోవాలో అర్థం కావట్లేదు సర్’ అని మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు.

కృష్ణంరాజు, కోట వైపు తీక్షణంగా చూసి.. కొన్ని క్షణాలు ఆలోచించి.. ‘ఒక పని చేయవయ్యా, 15 రోజులకు ఒక రూ. 20 వేలు తీసుకో. పేరు వచ్చేవాడివి, పైగా గొప్ప నటుడివి కాబట్టి.. కొన్నాళ్ళు పోయాక రేటు పెంచుకుంటూ పో’ అని అన్నారు. అలా కోట శ్రీనివాస రావు తన రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసుకుని.. కొన్నాళ్ళకు పెంచుకుంటూ పోయారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper