Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లి. అతడు బ్యాట్ విదిలించాడంటే రికార్డులే. ఏదైనా అతడు దిగనంత వరకే వన్స్ దిగితే తిరుగుండదు. క్వాలిక్యులేషన్స్ ఉండవు. కౌంట్లు ఉండవు. బ్యాట్ తో చెలరేగాడంటే రికార్డుల మోత మోగాల్సిందే. ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోడు. సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడతాడు. లక్ష మంది ప్రశ్నలకు తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడు. ఇన్నాళ్లు కాస్త వెనుకబడటంతో చాలా మంది ఇక విరాట్ పని అయిపోయింది. రిటైర్మెంట్ తీసుకోనున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరిన వారికి ఘాటుగానే సమాధానం చెప్పాడు. తన బ్యాట్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గురువారం అఫ్గనిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగి ఏకంగా పన్నెండు రికార్డులు సొంతం చేసుకోవడం గమనార్హం.

ఆసియా కప్ లో పోటీ నుంచి నిష్ర్కమించినా నామమాత్రపు మ్యాచ్ లో అఫ్గనిస్తాన్ ను ఆటాడుకున్నాడు. ఏకంగా 6 సిక్సులు, 12 ఫోర్లతో 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి తన స్టామినా ఏమిటో నిరూపించాడు. ఆసియా కప్ నుంచి ఇంటికెళ్లినా విరాట్ మెరుపులకు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. చాలా రోజులుగా అతడి ఫామ్ కోసం ఎదురు చూసిన వారికి మంచి బహుమతి లభించినట్లు అయింది. క్రికెట్ అభిమానులకు కనులవిందు చేశాడు. కోహ్లి ఫామ్ లోకి రావడం అందరికి సంబరమే తెచ్చింది. మూడేళ్లుగా సరిగా ఆడకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి గురువారం మాత్రం విశ్వరూపం చూపించాడు. పరుగుల వరద పారించాడు.
దాదాపు మూడేళ్లుగా సెంచరీలు చేయలేదు. ఇప్పటికే అతడి ఖాతాలో 70 సెంచరీలు ఉన్నా ఈ సెంచరీ మాత్రం ప్రత్యేకమే. అఫ్గాన్ తో జరిగిన మ్యా లో సాధించిన సెంచరీతో 71 నమోదు చేసుకున్నాడు. దీంతో ఏకంగా 12 రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. కోహ్లి విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఇందులో అతడు మరో పన్నెండు రికార్డులు సాధించడం గమనార్హం. టీ20ల్లో అత్యధిక పరుగులు(122) చేసిన ఆటగాడిగా మారాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాటర్ కోహ్లినే. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు(71) చేసిన ఆటగాడు కోహ్లి కావడం గమనార్హం.

టీ20ల్లో వంద సిక్సులు కొట్టిన రెండో భారత బ్యాటర్ కోహ్లి. టీ20ల్లో కోహ్లి కొట్టిన 122 పరుగులే యూఏఈలో అత్యధిక స్కోరు. టీ20ల్లో 3500 పరుగులు చేసిన రెండో ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో 24000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో ఆటగాడిగా నిలిచాడు. 522 ఇన్నింగ్స్ లలో అత్యంత వేగంగా 24 వేల పరుగులు చేసిన ఆటగాడిగా ఖ్యాతి గడించాడు. ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇన్ని రికార్డులు తిరగరాసి అభిమానుల గుండెల్లో మరోసారి సుస్థిర స్థానం సంపాదించుకున్న కోహ్లి జట్టుకు మరిన్ని సేవలు అందించాలని అందరు ఆకాంక్షిస్తున్నారు.