Devara Movie: కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా యూనిట్ మొత్తం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక రీసెంట్ గా “డిజే టిల్లు స్క్వేర్” సినిమా ఈవెంట్ లో ఎన్టీయార్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందంటూ సినిమా మీద అంచనాలను పెంచేశాడు.
ఇక దాంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిన క్రమంలో ఈ సినిమా ర్రషేశ్ ను చూసిన సినిమా యూనిట్ మొత్తం మూవీ ఆద్యంతం ఒక సీరియస్ మూడ్ లో నడుస్తుందని ఇలా అయితే ప్రేక్షకుడు ఎంజాయ్ చేయడం కష్టం అవుతుందేమో అనే పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి. ఇక సినిమా యూనిట్ అందరి ఒపీనియన్ ని బట్టి ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ని యాడ్ చేస్తూ మధ్యలో కొన్ని ఎంటర్ టెన్ మెంట్ సీన్లను కూడా యాడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలా అయితేనే ప్రతి ప్రేక్షకుడు 100% సినిమాని ఎంజాయ్ చేయగలడని సినిమా యూనిట్ మొత్తం భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక అందుకే కొరటాల శివ కూడా ఈ సినిమాలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ డోస్ ని కొంచెం పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి కొరటాల శివ ముందు సినిమాలను కనక చూసుకుంటే అందులో ఎంటర్ టెన్ మెంట్ కి పెద్దగా స్కోప్ అయితే ఉండదు. ఆయన సినిమాలు ఎప్పుడు స్లో నరేషన్ తో సినిమా చూసే ప్రేక్షకుడిని ఒక డిఫరెంట్ మూడ్ లోకి తీసుకెళ్తాయి.
అయితే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలనే ఉద్దేశ్యం తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతాడని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని సినిమా యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది…