Ram Charan: ప్రస్తుతం “గ్లోబల్ స్టార్” గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్... రంగస్థలం, త్రిబుల్ ఆర్ సినిమాల్లో ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేయబోయే “గేమ్ చేంజర్” సినిమాలో కూడా రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ఒకటి ఇప్పటివరకు తను చేయనటువంటి రాజకీయ నాయకుడి పాత్ర కావడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాతో పాటుగా బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో మరొక సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా జరుపుకోబొతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ 17 పేరుతో సుకుమార్ డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిట్ అయ్యాడట. ఇక ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ కి ఈ సినిమా స్టోరీ ని కూడా వినిపించారట.
ఆ కథ బాగా నచ్చిన రామ్ చరణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ కూడా పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ స్టోరీ ఫైనల్ వర్షన్ రామ్ చరణ్ కి వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాలని సుకుమార్ చూస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకు దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక దాంతో పాటుగా ఈ సినిమాని పాన్ వరల్డ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి…