Homeఎంటర్టైన్మెంట్Kirrak Seetha: 'బేబీ ' మూవీలో నటించినందుకు చంపేస్తామని బెదిరింపులు..నరకం అనుభవించిన నటి..వీడియో వైరల్!

Kirrak Seetha: ‘బేబీ ‘ మూవీలో నటించినందుకు చంపేస్తామని బెదిరింపులు..నరకం అనుభవించిన నటి..వీడియో వైరల్!

Kirrak Seetha: సినిమాని సినిమాలాగానే చూడాలి. అందులో నటించిన నటీనటులు, నిజ జీవితం లో కూడా అలాగే కనిపిస్తారని అనుకోవడం మూర్ఖత్వం. మనం 2026 వ సంవత్సరం లో ఉన్నాం. ఇప్పటికీ కూడా సినిమాల్లో నటించే నటీనటులు నిజ జీవితం లో కూడా అలాగే ఉంటారని అనుకునే వాళ్ళు ఉన్నారంటేనే ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్లకు అప్పట్లో ఆడియన్స్ చుక్కలు చూపించేవాళ్ళు. కోటా శ్రీనివాస రావు ఒక సినిమా థియేటర్ కి వెళ్తే ఆయన్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అది కేవలం సినిమా అమ్మా, అందులో నేను ఒక పాత్ర పోషించాను అంటే, నిజ జీవితం లో నేను అలా ఉండను అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అప్పట్లో కోటా శ్రీనివాస రావు కి, అప్పట్లో అంటే జనాలకు సినిమా అంటే పెద్దగా అవగాహన లేదు, చూసిందే నిజం అనుకుంటారు అనుకోవచ్చు.

అలాంటి సంఘటనలు ఆరోజుల్లో చాలానే జరిగాయి. కానీ సోషల్ మీడియా ఇంతలా అభివృద్ధి చెందిన ఈ మోడరన్ యుగంలో కూడా కొంతమంది సినిమాల్లో చూపించేవి నిజమని అనుకుంటున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘బేబీ’ చిత్రం. 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం లో హీరోగా నటించగా, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఇందులో హీరోయిన్ ని తప్పు దోవలో నడిచేలా చేసిన స్నేహితురాలి పాత్రలో కిరాక్ సీత నటిస్తుంది. అప్పటి వరకు చాలా పద్దతిగా ఉన్న హీరోయిన్, ఈమె సావాసంతో పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా అనుభవం గురించి రీసెంట్ గా కిరాక్ సీత ‘BB జోడీ 2’ ప్రోగ్రాం లో చెప్పుకొచ్చింది.

ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షోలో సాయి, నయని పావని జంటగా చాలా రోజుల వరకు చేశారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నయని పావని ఈ షో నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానం లోకి కిరాక్ సీత వచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో ఆమె రీతూ చౌదరి తో గొడవ పడడం మనమంతా చూశాము. అది పక్కన పెడితే ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ ని తప్పుదోవ పట్టించిన పాత్రలో కనిపించినందుకు, ఒకరు నాకు ఫోన్ చేసి బూతులు తిట్టడమే కాకుండా, మా అమ్మతో కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఫాలో అయ్యి, మా ఇంట్లోకి చొరబడి కొట్టడానికి చూసారు, సినిమాల్లోని పాత్రలను ఇంత వ్యక్తిగతంగా తీసుకుంటారని అసలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు క్రింద చూడొచ్చు.

 

BB JODI Season 2  Promo 3 | Connection Round🔥 | Sat & Sun at 9 PM | Star Maa

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version