https://oktelugu.com/

Kirrak Seetha: గెస్ట్ హౌస్ కి వస్తేనే ఆఫర్స్ .. బేబీ మూవీ యాక్టర్ సంచలన కామెంట్స్

పరిశ్రమ కి వచ్చిన కొత్తలో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం తిరిగే క్రమంలో నిర్మాతల నుంచి డైరెక్టర్స్ నుండి కొన్ని వల్గర్ మాటలు వచ్చాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2023 4:41 pm
    Kirrak Seetha

    Kirrak Seetha

    Follow us on

    Kirrak Seetha: పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలని అనేక మంది నటీమణులు ఈ రంగంలోకి వస్తారు. కానీ అందులో కొందరు మాత్రమే తాము అనుకున్న స్థాయికి చేరుకుంటారు. పైకి కనిపించే విధంగా లోపల ఉండదు ఈ రంగుల ప్రపంచం. ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యమైంది కాస్టింగ్ కౌచ్. ఎవరు అవునన్నా, కాదన్నా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది వాస్తవం.

    అప్పుడప్పుడు దీని గురించి కొందరు మాట్లాడిన కానీ, కేవలం అవి మాటలు గానే మిగిలిపోతున్నాయి కానీ, ఎలాంటి మార్పు అనేది లేదు. చిన్న చిన్న పాత్రలు వేసే వాళ్ళ దగ్గర నుండి పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ గా నటించే వాళ్లకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తప్పవు. అన్ని రంగాల్లో ఇలాంటివి ఉన్న కానీ సినీ పరిశ్రమ గ్లామర్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడే ఎక్కువ. తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కిర్రాక్ సీత హాట్ కామెంట్స్ చేసింది.

    చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించి, మంచి మార్కులు సొంతం చేసుకున్న కిర్రాక్ సీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బేబీ సినిమాలో నేను పోషించిన పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉన్న కానీ, నటన పరంగా నాకు మంచి పేరు తీసుకుని వచ్చింది. ఈ సినిమా తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా అంటూ చెప్పింది. అదే సమయంలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఓపెన్ గానే తాను ఎదుర్కొన్న అనుభవాలు గురించి చెప్పుకొచ్చింది.

    పరిశ్రమ కి వచ్చిన కొత్తలో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం తిరిగే క్రమంలో నిర్మాతల నుంచి డైరెక్టర్స్ నుండి కొన్ని వల్గర్ మాటలు వచ్చాయి. నన్ను గెస్ట్ హౌస్ కి రమ్మని కూడా పిలిచారు. కమిట్మెంట్స్ ఇస్తే అవకాశాలు ఇస్తామని కూడా చెప్పారు. అలాంటి వాటికి నేను ఒప్పుకోలేదు. నా టాలెంట్ తోనే అవకాశాలు వస్తాయని ఎదురుచూశాను. ఇప్పటికి కూడా అదే నమ్మకంతో ఉన్నాను. అందుకే కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోనంటూ చెప్పుకొచ్చింది కిర్రాక్ సీత