https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ప్రేరణ కి ఇచ్చిపారేసిన కిరాక్ సీత..రోజురోజుకు గ్రాఫ్ పెంచేసుకుంటుంది!

'కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్' అనే ప్రోగ్రాం లో అద్భుతంగా గేమ్స్ ఆడి మగవాళ్లకు సైతం వణుకు పుట్టించేలా చేసింది. అంతే కాదు ఈమె తన మాటలతో మంచి మాటకారి అని కూడా అనిపించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 05:49 AM IST

    kirrak seetha(1)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ప్రేరణ కంభం బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అనే వార్త తెలియగానే ప్రేక్షకులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఈమె ఈ షోలో పాల్గొనే ముందు ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే ప్రోగ్రాం లో అద్భుతంగా గేమ్స్ ఆడి మగవాళ్లకు సైతం వణుకు పుట్టించేలా చేసింది. అంతే కాదు ఈమె తన మాటలతో మంచి మాటకారి అని కూడా అనిపించుకుంది. బిగ్ బాస్ షో కి ఈమె పర్ఫెక్ట్ అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేరణ నుండి ఇప్పటి వరకు అయితే అంచనాలకు తగ్గ పెర్ఫార్మన్స్ రాలేదు. ఎంటర్టైన్మెంట్ షోస్ లో అద్భుతంగా టాస్కులు ఆడే అమర్ దీప్ కి హౌస్ లో సెట్ అవ్వడానికి 5 వారాల సమయం పట్టింది. ప్రేరణ కూడా చిన్నగా కోలుకుంటుంది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

    అయితే చాలా మంచి అమ్మాయి అనిపించుకున్న ప్రేరణ నుండి కొన్ని లక్షణాలు చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ఆమె చెత్త బుట్టలో పడేసిన కూల్ డ్రింక్ బాటిల్ ని తీసి మళ్ళీ టేబుల్ మీద పెడుతుంది. ఇది తప్పు మాత్రమే కాదు, మహా పాపం కూడా, ఏమాత్రం మానవీయ కోణంలో చూడదగిన విషయం కాదు. ఆమెకి తెలిసి చేసిందో, లేకపోతే ఏదైనా ఆవేశం లో చేసిందో తెలియదు కానీ, ప్రేరణ చేసింది మాత్రం ముమ్మాటికీ తప్పే. నేడు ఆమె సీతతో మాట్లాడుతూ నేను చేసింది తప్పు కాదు, కానీ నువ్వు నా వల్ల బాధపడుంటే క్షమించు అని అడుగుతుంది. చెత్తబుట్టలో నుండి ఒక వస్తువుని తీసి టేబుల్ మీద పెట్టడమే పెద్ద తప్పు, నువ్వు ఆ తప్పుని ఇప్పటికీ సమర్ధించుకుంటున్నావు, నీ తప్పు నువ్వు ఒప్పుకోనప్పుడు క్షమాపణలు కూడా చెప్పకు, నాకు అవసరం లేదు అంటూ ప్రేరణ కి దిమ్మ తిరిగే రేంజ్ లో సమాధానం చెప్పింది. మొన్న కూడా ఆమె అభయ్ తో గొడవ పడిన విషయం లో ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంది. వాస్తవానికి కుకింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నిఖిల్ టీం కి కేటాయించింది యష్మీ. కానీ నిఖిల్ కి బదులుగా అభయ్ ఆమ్లెట్ వేసుకోవడానికి వస్తాడు.

    అప్పుడు అభయ్ సీత తింటున్న సమయంలో వచ్చి గిన్నెలు కడుగు అని అంటాడు. దీనికి మండిపోయిన సీత మీకు సంబంధించిన పని కాకపోయినా మీరు కలగచేసుకొని పని చేస్తున్నారు, అలాంటప్పుడు వంటగదిలో ఏదైనా మిగిలిన గిన్నెలు ఉంటే ఎవరి చేత అయినా కడిగించొచ్చు కదా, 24 గంటలు మేము క్లీనింగ్ చేస్తూనే ఉండాలా?, మా శక్తి మొత్తం దీనికే ఉపయోగిస్తే ఇక టాస్కులు ఆడేందుకు ఎక్కడ నుండి ఓపిక వస్తుంది అంటూ విరుచుకుపడింది. సీత గేమ్ ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదు కానీ, ఈమె మాటలు చురకత్తులు లాగ దూసుకుపోతున్నాయి. మాటలకు తగ్గట్టుగా టాస్కులలో కూడా తన సత్తా చూపిస్తే కచ్చితంగా ఈమె టాప్ 5 వరకు వెళ్లగలదు అని చెప్పొచ్చు.