Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) పశ్చాత్తాప పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అయితే అంబటి రాంబాబును అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఏదో ఆవేశంతో అన్న మాటలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పారని.. అటువంటి వ్యక్తిని దండించడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అంటూ మాట్లాడారు. అంబటి జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కూడా.. రాజకీయ అనుభవం ఉన్న నేను ఎవరో రచ్చగొడితే.. హుందాగా ప్రవర్తించాల్సిన నేను ఆవేశంతో నోరు జారాను. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడడం తప్పి అని అన్నారని చెప్పుకొచ్చారు.. దీంతో అంబటి రాంబాబు లో బ్రహ్మాండమైన మార్పు వచ్చిందని.. ఆయన పశ్చాత్తాప పడుతున్నారని అంతా భావించారు. కానీ నిన్న మళ్ళీ రిమాండ్ కు తరలించే క్రమంలో అంబటి రాంబాబు హావభావాలు చూస్తే ఒక నిర్ణయానికి రావచ్చు. ఆయన పశ్చాత్తాప పడే రకం కాదని కూడా తేలిపోయింది.
* ఒక స్క్రిప్ట్ ప్రకారమే..
అంబటి రాంబాబు అయినా.. ఇంకొకరు అయినా వైసీపీలో ఒక స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి కామెంట్స్ చేస్తారు. అక్కడ ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం వ్యక్తం చేసే వారికి చోటు ఉండదు. అలా ఆశించలేము కూడా. అటువంటిది అంబటి రాంబాబు పశ్చాత్తాప పడ్డారు అంటే ఏమనుకోవాలి. నిన్ననే గుంటూరు సివిల్ జడ్జ్ కోర్టుకి వ్యానులో తీసుకు వచ్చినప్పుడు అక్కడ తనకోసం ఎదురుచూస్తున్న అనుచరులు, మీడియా ప్రతినిధులను చూసి గడ్డం కింద నుంచి చెయ్యి తిప్పుతూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా తగ్గేదేలే అని సైగ చేశారు. అది చూసి ఆయన అనుచరులు కూడా ఉత్సాహంగా రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు.
* ఆ పార్టీ డిఎన్ఎ గా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ డిఎన్ఏ లోనే అది నిండిపోయింది. అటువంటప్పుడు అంబటి రాంబాబు పశ్చాత్తాప పడతారని.. పడ్డారని అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు అని అర్థమైంది. అరెస్టుకు ముందే అంబటి రాంబాబు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు పై కామెంట్స్ చేసే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను అరెస్టు చేసుకుంటారా చేసుకోండి. ఇక్కడే ఉన్నా. అరెస్టు చేస్తే బెయిల్ కూడా అడగను. ఎంత కాలమైనా జైల్లో ఉంటానని కూడా చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆయన అనుకున్న మాదిరిగానే జైలు మీద జైలుకు తిరుగుతూనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన ముఖంలో పశ్చాత్తాపం కాదు కదా.. విపరీతమైన కోపం కనిపిస్తోంది.
పుష్ప స్టైల్లో అంబటి రాంబాబు: “తగ్గేదేలే” అంటూ సైగలు…#AmbatiRambabu pic.twitter.com/L7DALfeHXD
— M9 NEWS (@M9News_) February 12, 2026