https://oktelugu.com/

ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

బాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే.. ముందుగా గుర్తుకువచ్చే పేరు కియారా అద్వానీ. స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో అమ్మడు తన హవా చూపిస్తోంది. పైగా ఈ లాక్ డౌన్ లో కూడా కియారా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కియరా నటించిన 2 సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం.. వాటిల్లో కియారాకు మంచి నేమ్ రావడంతో ఏ స్టార్ హీరోయిన్ కి దక్కని ఫాలోయింగ్ కరోనా […]

Written By: , Updated On : November 22, 2020 / 12:44 PM IST
Follow us on

Indoo Ki Jawani
బాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే.. ముందుగా గుర్తుకువచ్చే పేరు కియారా అద్వానీ. స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో అమ్మడు తన హవా చూపిస్తోంది. పైగా ఈ లాక్ డౌన్ లో కూడా కియారా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కియరా నటించిన 2 సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం.. వాటిల్లో కియారాకు మంచి నేమ్ రావడంతో ఏ స్టార్ హీరోయిన్ కి దక్కని ఫాలోయింగ్ కరోనా టైంలో బాలీవుడ్ లో కియారాకు దక్కింది. అయితే సిల్వర్ స్క్రీన్ ను మిస్ అయ్యానని అమ్మడు తెగ ఇదైపోతుందట. పైకి నవ్వుతూ కనిపించినా, థియేటర్లను మిస్ అయిన బాధ కియరాకు ఉండనే ఉంది. ఇప్పుడు ఆ బాధ కూడా ఈ బ్యూటీకి తీరిపోనుంది.

Also Read: పెళ్లికి రెడీ అంటున్నా.. బుల్లితెర రాములమ్మ

ఎట్టకేలకు కియారా సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఆమె నటించిన ”ఇందూకీ జవానీ” సినిమా వచ్చేనెల 11న నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఎప్పుడైతే తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందో.. ఇక అప్పటినుంచీ కియరా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. ఇక రీసెంట్ గా ఆమె నటించిన ”లక్ష్మి”, ”గిల్టీ” సినిమాలు రెండూ ఓటీటీలోనే రిలీజ్ అయి.. ఈ ముద్దుగుమ్మకు మంచి పేరే తీసుకొచ్చాయి. పైగా ఓటీటీలో కూడా స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ ను కియారాకు తెచ్చిపెట్టాయి. ఓటీటీలో మరో ఏ స్టార్ హీరోయిన్ కి లేని క్రేజ్ కియారాకి దక్కింది.

Also Read: హిటెక్కుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్.. టాప్-5లో ఉండేది వీరేనా?

అందుకే ఓ దశలో ”ఇందూకీ జవానీ” సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అనే ప్రచారం జరిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆ సినిమా కోసం బాగానే పోటీ పడ్డాయి. కియారా సినిమా అనగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్ని కాస్త భారీ మొత్తాన్నే సమర్పించడానికి రెడీ అంటున్నాయి. కానీ ”ఇందూకీ జవానీ” మేకర్స్ మాత్రం ఎట్టకేలకు తమ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కియరా కూడా తన సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని ఆశ పడుతొంది. మొత్తానికి త్వరలోనే తన అందాల్ని ప్రేక్షకులకు వెండితెర పై చూపించాలానే కియారా కోరిక కూడా తీరబోతుంది అన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్