https://oktelugu.com/

ఏపీలో రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్.. మార్పులు ఇవే!

కరోనాతో విద్యార్థుల చదువులు కూడా ఆగమాగం అయ్యాయి. వైరస్‌ ధాటికి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే పరీక్షలు లేకుండా విద్యార్థులను పై చదువులకు ప్రమోట్‌ చేశారు. దేశంలో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఇటీవల అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లోనూ స్కూళ్లు ఓపెన్‌ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్‌ అని చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్‌ తెరవాలని భావిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ నిర్ణయం తీసుకోవడం లేదు. Also Read: కాంగ్రెస్ తో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 2:25 pm
    Follow us on

    Schools

    కరోనాతో విద్యార్థుల చదువులు కూడా ఆగమాగం అయ్యాయి. వైరస్‌ ధాటికి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే పరీక్షలు లేకుండా విద్యార్థులను పై చదువులకు ప్రమోట్‌ చేశారు. దేశంలో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఇటీవల అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లోనూ స్కూళ్లు ఓపెన్‌ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్‌ అని చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్‌ తెరవాలని భావిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ నిర్ణయం తీసుకోవడం లేదు.

    Also Read: కాంగ్రెస్ తో జగన్ పొత్తు.. ఊ కొడుతారా..? ఛీ కొడుతారా..?

    స్కూళ్లు తెరవాలని ప్రభుత్వాలు అనుకుంటున్నా విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా..? లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. విద్యార్థుల ఇష్ట ప్రకారమే అంటూ కేంద్రం కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏపీలో మళ్లీ స్కూళ్లను రేపటి నుంచి రీఓపెన్ చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది.

    సంక్రాంతి సెలవుల తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సూచించారు.

    Also Read: పవన్ కళ్యాణ్ ట్రోల్స్ బారిన పడ్డాడా?

    ఇక 6,7వ తరగతి విద్యార్థులకు మాత్రం డిసెంబర్ 14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.రేపటి నుంచి పదోతరగతి విద్యార్థులకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే 8,9వ తరగతుల విద్యార్థులకు రోజు మార్చి రోజు క్లాసులు జరుగుతాయని చెప్పారు.