Kancha Gachibowli Land Issue: కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్లను తొలగించినా.. మరేదైనా పని చేసినా తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ని సుప్రీం కోర్ట్ హెచ్చరించింది. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను జెసిబిలు చదను చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫోటోలను సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా రూపొందించిన ఫోటో.. అయినప్పటికీ వారు అలానే షేర్ చేస్తున్నారు. ఇంత గొప్ప ఫోటో తీసిన వ్యక్తిని గుర్తించి తనకు కనుక పట్టిస్తే కచ్చితంగా 10 లక్షల రివార్డు ఇస్తానని” రోహిన్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి వ్యక్తిని సన్మానించుకోవడం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఈ ప్రకటన చేశారు.
Also Read: బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్!
సోషల్ మీడియాలో తెగ ప్రచారం
కంచ గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాలకు సంబంధించి చదును కార్యక్రమం మొదలైన నాటి నుంచి గురువారం వరకు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఈ భూముల పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరుగళం వినిపించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జెసిబిలు చదును చేస్తుంటే నెమళ్లు అరిచినట్టుగా.. జింకలు పారిపోయినట్టుగా వీడియోలు, శబ్దాలు రూపొందించడం.. వాటిని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అయితే రెండు రోజులపాటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఉక్క పోత ఎదురయింది. అయితే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినవని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఫ్యాక్ట్ చెక్ రూపంలో ఫోటోలను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడంతో.. అప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రోహిన్ రెడ్డి ట్విట్టర్లో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తుండగా.. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన తీరును తప్పు పడుతున్నారు. ” ఆ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించింది కావచ్చు. కానీ వాస్తవ పరిస్థితి అలానే ఉంది. ఆ మాత్రం అర్థం కావడం లేదా? పర్యావరణాన్ని నాశనం చేస్తూ చేసే అభివృద్ధి ఎవరికి కావాలి? హైదరాబాద్ నగరం ఇప్పటికే కాలుష్యంగా మారిపోయింది. ఆ కాస్త గాలిని ఇచ్చే చెట్లను కూడా ఇలా తొలగిస్తే ఎలా అంటూ” వారు రోహిన్ రెడ్డి పై మండిపడుతున్నారు.. పది లక్షల రివార్డు కాదు.. ముందు పది లక్షల మొక్కలు నాటి చూపించండి అంటూ సవాల్ విసురుతున్నారు.
I would like to request all those eminent personalities who
posted this picture on their “X” kindly get me this “GREATEST PHOTOGRAPHER” who has taken this picture…. and take the reward of 10Lakhs … … # pic.twitter.com/lDKTZG04yz— Dr.Rohin Reddy (@DrCRohinReddy) April 3, 2025