Ketika Sharma
Ketika Sharma : యంగ్ హీరో నితిన్(Hero Nithin) వరుసగా రెండు డిజాస్టర్ సినిమాల తర్వాత ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రంతో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘అది దా సర్ప్రైజ్’ సాంగ్ ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. యూత్ ఆడియన్స్ కి ఈ సాంగ్ ఒక రేంజ్ లో నచ్చితే, విమర్శకులు మాత్రం ఈ పాటపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటలో హీరోయిన్ చేత అసభ్యకరమైన స్టెప్పులు వేయించాడని, ఈమధ్య కాలంలో ఈయనకు ఇది చాలా కామన్ అయిపోయింది అంటూ విమర్శలు వచ్చాయి. మహిళా కమీషన్ కూడా మూవీ టీం కి పాటలోని కొన్ని స్టెప్పులు మార్చాలంటూ నోటీసులు జారీ చేసింది. మూవీ టీం నుండి ఎలాంటి రియాక్షన్ ఇంకా బయటకు రాలేదు.
Also Read : ఒక పక్క బూతు స్టెప్స్ అంటూ శేఖర్ మాస్టర్ ని ఏకిపారేస్తుంటే… హీరోయిన్ కేతిక శర్మ ఏం చేసిందో చూడండి!
అయితే ఈ పాటలో హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma) మాత్రం డ్యాన్స్ దంచి కొట్టేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కుర్రకారులు అయితే ఆమె హాట్ స్టెప్పులకు మెంటలెక్కిపోయాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ ఫుల్ ప్రొమోషన్స్ చేస్తుంది. సరైన హిట్ లేక, అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న కేతిక శర్మకు ఈ సాంగ్ ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు అనే చెప్పాలి. అయితే ఈ సాంగ్ చేయడం కోసం ఆమె దాదాపుగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు హీరోయిన్ గా కూడా ఈమె ఇంత రెమ్యూనరేషన్ అందుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. అంత రెమ్యూనరేషన్ ఇచ్చారు కాబట్టే సోషల్ మీడియా లో కూడా ప్రొమోషన్స్ దంచి కొట్టేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ సాంగ్ కారణంగానే సినిమా పై హైప్ ఏర్పడింది. థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇకపోతే ఈ చిత్రం ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన క్యారక్టర్ కూడా ఈ సినిమాపై హైప్ పెరగడానికి గల కారణాలలో ఒకటని స్వయంగా డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం అనుమతిని కూడా ఇచ్చేసారు. ట్రైలర్ ని చూస్తే చాలా కాలం తర్వాత నితిన్ ఒక మంచి ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు అనేది అర్థం అవుతుంది. భీష్మ లాగా ఈ చిత్రంతో ఆయన బ్రేక్ అందుకుంటాడో లేదో చూడాలి.