Sekhar Master , Ketika Sharma
Sekhar Master and Ketika Sharma : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తీవ్ర విమర్శలపాలవుతున్నారు. ఆయన కంపోజ్ చేసిన పలు సాంగ్స్ లో స్టెప్స్ వల్గర్ గా ఉండటమే దీనికి కారణం. తాజాగా రాబిన్ హుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన కేతిక శర్మతో మరింత అసభ్యకరమైన మూమెంట్ చేయించాడు. దాంతో బూతు స్టెప్స్ లోనే క్రియేటివిటీ ఉందా?, ఇలాంటి వల్గర్ మూమెంట్స్ చేయించడం తప్ప ఇంకేమీ రావా? అంటూ శేఖర్ మాస్టర్ ని మీడియా ఏకి పారేస్తోంది. ఈ క్రమంలో కేతిక శర్మ చేసిన పని చర్చకు దారి తీసింది.
శేఖర్ మాస్టర్ గుంటూరు కారం మూవీలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కంపోజ్ చేశాడు. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా మాస్ స్టెప్స్ తో అలరించాడు. అయితే హీరోయిన్ శ్రీలీల వేసిన కొన్ని స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయనే మాట వినిపించింది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ-భాగశ్రీ బోర్సే మీద ఓ రొమాంటిక్ సాంగ్ కంపోజ్ చేశాడు. ఈ పాటలో హీరోయిన్ చీర కుచ్చిళ్ళు హీరో పట్టుకోవడం, హీరోయిన్ వెనుక జేబుల్లో చేతులు పెట్టి దరువు వేయడం విమర్శలపాలైంది. మీడియా దర్శకుడు హరీష్ శంకర్ పై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో రవితేజను కూడా ట్రోల్ చేశాడు.
ఆ పాట శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. నాకు కూడా కొన్ని స్టెప్స్ నచ్చలేదు. కానీ చెప్పలేకపోయాను అని హరీష్ శంకర్ వివరణ ఇచ్చాడు. ఇక డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ మరింత వివాదం రాజేసింది. బాలకృష్ణ వంటి ఓ సీనియర్ హీరో హీరోయిన్ ఊర్వశి రాతెలా పిరుదుల పై దరువు వేయడం, జుగుప్సాకరమైన హ్యాండ్ మూమెంట్స్ చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఈ వల్గర్ స్టెప్స్ ని బాలయ్య సమర్థించుకోవడం విశేషం. డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో ఆ స్టెప్ వేసి చూపించాడు. విమర్శలు ఐ డోంట్ కేర్ అని పరోక్షంగా తెలియజేశాడు.
శేఖర్ మాస్టర్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. తాజాగా రాబిన్ హుడ్ మూవీలో కేతిక శర్మ ఐటెం సాంగ్ సాంగ్ చేసింది. ‘ఇదిదా సర్ప్రయిజు’ అనే ఈ ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. కేతిక తన ఫ్రాక్ ముందు లాగి స్టెప్ వేయడం అత్యంత దారుణంగా ఉంది. ఈ సాంగ్ కూడా శేఖర్ మాస్టర్ నే కంపోజ్ చేశాడు. ఎందరు విమర్శించినా శేఖర్ మాస్టర్ మారడం లేదని సోషల్ మీడియాలో జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఇంత రాద్ధాంతం జరుగుతుంటే.. కేతిక శర్మ సేమ్ స్టెప్ వేసి తన ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. చూస్తుంటే ఈ వివాదాన్ని రాబిన్ హుడ్ టీమ్ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. డబ్బే పరమావధి తప్ప పరువు గురించి ఆలోచించడం లేదని జనాలు మండిపడుతున్నారు.
Also Read : రియల్ ఎస్టేట్ లో కోట్లు నష్టపోయిన శేఖర్ మాస్టర్… అయిన వాళ్లే మోసం చేశారంటూ లబోదిబో