Ketika Sharma
Ketika Sharma : ఈమధ్య కాలంలో సినిమాల్లోని ఐటెం సాంగ్స్ హద్దులు దాటేస్తున్నాయి. యూత్ ఆడియన్స్ ని ఆకర్షించడం కోసం అసభ్యకరమైన స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్స్. ముఖ్యంగా ఈ లిస్ట్ లో శేఖర్ మాస్టర్(Shekar Master) ముందు వరుసలో ఉంటాడు. ఈయన కంపోజ్ చేసే పాటలకు సోషల్ మీడియా లో ఏ రేంజ్ విమర్శలు వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే యూత్ ఆడియన్స్ అలాంటి పాటలకు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి. మిస్టర్ బచ్చన్ చిత్రం లో హీరోయిన్ బ్యాక్ పాకెట్స్ మీద రవితేజ చేతులు వేయడం, ‘డాకు మహారాజ్’ లో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో బాలయ్య ఊర్వశి రౌతేలా వెనుక భాగం పై గుద్దుతున్నట్టు స్టెప్పులు పెట్టడం, ఇలా ఒక్కటా రెండా, శేఖర్ మాస్టర్ పాట విడుదల అయ్యిందంటే సోషల్ మీడియా మొత్తం హీట్ వాతావరణం లో ఉంటుంది. కానీ చివరికి ఆ పాటలే సూపర్ హిట్స్ అవుతున్నాయి అనుకోండి అది వేరే విషయం.
Also Read : ఆ సన్నివేశాలపై పై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్… అందుకే చేయడం లేదట!
రీసెంట్ గా ఆయన నితిన్(Hero Nithin) హీరో గా నటించిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రంలో ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ(Kethika Sharma) పై ఒక స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేశాడు. ‘అది దా సర్ప్రైజ్’ అంటూ సాగే ఈ పాటని యూత్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి సాంగ్స్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యువతని తప్పు దోవ పట్టించే ఇలాంటి పాటలకు సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్ లా లూజ్ డ్రెస్ ని విప్పి చూపిస్తూ స్టెప్పులు వేయడం ఏమిటి?, అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం? అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒకపక్క ఈ రేంజ్ ట్రోల్స్ నడుస్తుంటే హీరోయిన్ కేతిక శర్మ మాత్రం వాటిని పట్టించుకోలేదు.
ఏ స్టెప్పు ని అయితే కొంతమంది విమర్శిస్తున్నారో, అదే స్టెప్పుకి డ్యాన్స్ వేస్తూ కాసేపటి క్రితమే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక రీల్ ని అప్లోడ్ చేసింది. ఈ రీల్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే, కేతిక శర్మ కి మాత్రం ఈ ఒక్క పాటతో యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. మల్లె పూలను చూస్తేనే మన కుర్రాళ్లే మాతెక్కిపోతారు. అలాంటి మల్లె పూలను తన జాకెట్ లాగా ధరించి, శరీరం మొత్తం ఆయిల్ పూసుకొని కేతిక శర్మ అలా డ్యాన్స్ వేస్తే కుర్రాళ్ళు పడిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చాలా ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చింది కానీ, ఈ పాటకు వచ్చినంత రెస్పాన్స్ ఏ పాటకు రాలేదు. థియేటర్స్ లో ఈ పాట వచ్చినప్పుడు రెస్పాన్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అనుకోవచ్చు.