Dragon
Dragon : తమిళనాడు లో యూత్ ఆడియన్స్ కి ఈమధ్య కాలంలో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan|) కనెక్ట్ అయ్యినంతగా, అక్కడి స్టార్ హీరోలు కూడా కనెక్ట్ అవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఒక డైరెక్టర్ గా ‘కోమలి’ చిత్రం తో తన కెరీర్ ని ప్రారంభించాడు. అంతకు ముందు ఆయన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అలా జయం రవి దృష్టిలో పడ్డాడు, మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మారే ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘లవ్ టుడే’ చేసాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఆయనే, హీరో కూడా ఆయనే. కమర్షియల్ గా ఈ చిత్రం అటు తమిళం లో ఇటు తెలుగు లో సంచలన విజయం సాధించింది. వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
Also Read : ఓటీటీలో ‘డ్రాగన్’ సునామీ..13 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్'(Dragon Movie) అంతకు మించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. థియేటర్స్ నుండి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదల అయినప్పటికీ , ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. ఈ చిత్రాన్ని రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన తలపతి విజయ్(Thalapathy Vijay) చూశాడట. చూసిన వెంటనే మూవీ టీమ్ మొత్తాన్ని తన ఇంటికి పిలిచి ట్రీట్ ఇచ్చాడట. సినిమాని చాలా అద్భుతంగా తీసారని, చాలా కాలం తర్వాత ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని అందించారని అభినందించాడట. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ ని ప్రత్యేకించి మెచ్చుకున్నాడట. నీలో చాలా టాలెంట్ ఉంది, నీ నటన కంటే నీ దర్శకత్వం నాకు బాగా ఇష్టం, లవ్ టుడే అద్భుతంగా తెరకెక్కించావు అని అన్నాడట.
మీతో ఒక సినిమా చేయాలి అనేది నా కోరిక సార్ అని ప్రదీప్ విజయ్ తో చెప్తే, ఇప్పట్లో సినిమాలు చేసే ఆలోచన లేదు, ఒకవేళ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటే, నువ్వే నా సినిమాకు డైరెక్టర్ అని చెప్పేశాడట. ఆయన ఇచ్చిన ఈ మాటతో ప్రదీప్ రంగనాథన్ కి మాటల్లో చెప్పలేని ఆనందానికి గురయ్యాడట. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ తమిళం లో ‘LIC’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ప్రదీప్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వహించబోతున్నాడు.
Also Read : బంపర్ ఛాన్స్ కొట్టేసిన ‘డ్రాగన్’ హీరోయిన్..ఇక స్టార్ అయిపోయినట్టే!