spot_img
Homeఎంటర్టైన్మెంట్Good Luck Sakhi: కీర్తి సురేష్ "గుడ్ లక్ సఖి" చిత్రానికి ఏమైంది... మరోసారి విడుదల...

Good Luck Sakhi: కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రానికి ఏమైంది… మరోసారి విడుదల తేదీ వాయిదా

Good Luck Sakhi: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి, ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధం అయ్యింది. కరోనా దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడినట్టే… ఈ సినిమా కూడా వాయిదా పడింది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత… నెమ్మదిగా సినిమాలు థియేటర్లలోకి రావడం ప్రారంభించాయి.

keerthi suesh good luck sakhi movie release again post poned to december 31st
Good Luck Sakhi

Also Read: Balayya: అక్కడ కూడా రికార్డుల మోత మోగిస్తోన్న బాలయ్య !

దాంతో ‘గుడ్ లక్ సఖి’ని నవంబర్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా… డిసెంబర్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు నిర్మాత సుధీర్ చంద్ర వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అనుకోని కారణాల రీత్యా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించారు. తాజాగా డిసెంబర్ 31న సినిమాను విడుదల చేయనున్నట్టు సహ నిర్మాత శ్రావ్యా వర్మ ట్వీట్ చేశారు. “సినిమాను మీ (ప్రేక్షకుల) ముందుకు తీసుకు రావడానికి మేం చాలా కష్టపడుతున్నాం. కానీ, అనుకోని సమస్యల కారణంగా విడుదలను డిసెంబర్ 31కి వాయిదా వేశాం. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి” అని ఆమె పేర్కొన్నారు.‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Engineering: ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు వీళ్లే..!

https://twitter.com/shravyavarma/status/1467455950097317890?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1467455950097317890%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fkeerthy-suresh-s-good-luck-sakhi-movie-release-postponed-again-here-is-the-new-release-date-12855

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper