Balagam Venu : బలగం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు వేణు ఎల్దండి(Venu Yeldandi).ఈయన చేసిన ఈ ఒక్క సినిమా ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఈయన నితిన్ తో ఎల్లమ్మ (Ellamma) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ ఎల్లమ్మ సినిమాకి మొదటి నుంచి కూడా హీరోయిన్ కష్టాలైతే తప్పడం లేదు. ఇంతకుముందు సాయి పల్లవి (Sai Pallavi) ఈ సినిమాలో ఎల్లమ్మ (Ellamma) పాత్రలో నటించబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి అది కార్యరూపం అయితే దాల్చలేదు. ఇక ఆమె తర్వాత కీర్తి సురేష్ (Keerthi Suresh) ఈ సినిమాలో నటిస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఆమె కూడా ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బలగం సినిమాలో స్టార్స్ ఎవ్వరు లేకుండా కంటెంట్ తో సక్సెస్ ను సాధించిన ఆయన ఇప్పుడు మాత్రం స్టార్స్ కోసం వెయిట్ చేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎల్లమ్మ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇక బలగం (Balagam) సినిమా చూసిన చాలామంది వేణు మూవీ టేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నారు.
Also Raed : జబర్దస్త్ ట్యాగ్ నాకొద్దు, ఎన్టీఆర్ మూవీలో ఆ సీన్ నాదే.. సంచలనంగా బలగం వేణు కామెంట్స్
కాబట్టి ఈ సినిమా కూడా పల్లెటూరు నేపథ్యంలోనే సాగుతుంది. కాబట్టి వాళ్లు ఈ కథని పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మిగతా స్టార్ హీరోయిన్ల కోసం ఎదురుచూడడం కంటే ఈ సినిమా పక్క పల్లెటూరు నేపథ్యంలో వస్తుంది కాబట్టి తెలుగులో అవలేబుల్ లో ఉన్న హీరోయిన్లను తీసుకోవడం బెటర్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వైష్ణవి చైతన్య (Vaishnavi chaithanya), తెలుగు హీరోయిన్…
ఆమె అందంగా ఉంటుంది. డాన్సులు కూడా బాగా వేస్తుంది. కాబట్టి ఇలాంటి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమెతో పాటుగా ‘మల్లేశం’ సినిమాలో చేసి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనన్య నాగెళ్ళ కూడా తెలుగమ్మాయే కావడం విశేషం…
ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరో ఒక్కరైన సరే ఆ సినిమాలో హీరోయిన్ గా సెట్ అవుతారు. కాబట్టి వీరిలో ఎవర్నో ఒకరిని హీరోయిన్ గా తీసుకొని తెలుగు వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… వేణు మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికి రెండో సినిమా కోసం ఎందుకని స్టార్స్ దగ్గరికి వెళ్ళాలి మన లోకల్ ఆర్టిస్టు లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు… ఇప్పటికైనా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : నువ్వేమైనా బాహుబలి తీస్తున్నావనుకుంటున్నావా? బలగం వేణును అంతగా అవమానించారా?