Mohanlal movie child Artist : ఈ ఫొటోలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తల్లి మలయాళం లో పెద్ద స్టార్ హీరోయిన్. తండ్రి కూడా మలయాళం లో ఒక స్టార్ డైరెక్టర్. ఫలితంగా ఈమె చిన్నతనం లోనే అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. చిన్నతనం లోనే ఈమె నటనలో ఎంతో పరిణీతి కనిపించేది. ఆరోజుల్లో ఈమెని పెద్దయ్యాక గొప్ప స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు. అంచనా వేసినట్టు గానే ఈమె స్టార్ హీరోయిన్ అవ్వడమే కాదు, నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. నేటి తరం హీరోయిన్స్ లో నటన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ఈమె గురించే మాట్లాడుకోవాలి. ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్(Keerthi Suresh). మలయాళం లో ఈమె చిన్నతనంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటిగా చేసింది.
Also Read :విజయ్ దేవరకొండతో కాఫీ షాప్ లో తమన్నా..సంచలనం రేపుతున్న వీడియో!
మోహన్ లాల్ హీరో గా నటించిన ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన కీర్తి సురేష్, పెద్దయ్యాక ఆయన సరసన హీరోయిన్ గా నటించింది అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మక తప్పదు, ఎందుకంటే అది నిజమే కాబట్టి. పెద్దయ్యాక ఈమె మొదటి సినిమా మోహన్ లాల్ తోనే చేసింది. తెలుగు లో ప్రియమణి ద్విపాత్రాభినయం చేసిన ‘చారులత’ అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రానికి మాతృక మలయాళం లో తెరకెక్కిన ‘గీతాంజలి’. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా, విలన్ గా ద్విపాత్రాభినయం చేసి తొలిసినిమాతోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత 2021 వ సంవత్సరం లో ఈమె మోహన్ లాల్ తో కలిసి ‘మరక్కార్’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.
ఇలా బాలనటిగా చేసి,మళ్ళీ అదే హీరో సినిమాలో హీరోయిన్ గా నటించడం గతంలో శ్రీదేవి విషయం లో జరిగింది, ఆ తర్వాత కీర్తి సురేష్ విషయంలోనే జరిగింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ఆంటోనీ అనే తన బాల్య స్నేహితుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇస్తూ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ కాబోతుంది. నితిన్, బలగం వేణు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయ్యింది. ‘మహానటి’, ‘దసరా’ చిత్రాల తర్వాత కీర్తి సురేష్ కి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఈ సినిమాలోనే దక్కింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని నాని తో చేద్దామని అనుకున్నారు కానీ , ఎందుకో అది నితిన్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించబోతున్నాడు.
