Homeఎంటర్టైన్మెంట్Karuppu 5 days box office collections: సునామీ ని తలపిస్తున్న 'కరుప్పు' బాక్స్ ఆఫీస్...

Karuppu 5 days box office collections: సునామీ ని తలపిస్తున్న ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ విద్వంసం.. 5 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Karuppu 5 days box office collections: ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో ‘సూర్య’ నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు. సూర్య స్టార్ స్టేటస్ పై అనుమానాలు పెట్టుకున్న ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఫూల్ చేసింది. తెలుగు […]

Karuppu 5 days box office collections: ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో ‘సూర్య’ నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు. సూర్య స్టార్ స్టేటస్ పై అనుమానాలు పెట్టుకున్న ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఫూల్ చేసింది. తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే పేరు తో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి మొదటి రోజున 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయితే , 5 వ రోజున 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో మీరే చూడండి. తమిళనాడు లో కూడా ఇదే పరిస్థితి.

మొదటి రోజు ఈ చిత్రానికి తమిళనాడు లో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, 5 వ రోజున 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రజినీకాంత్ కి తప్ప, ఏ హీరో కి కూడా తమిళనాడు లో వరుసగా 5 రోజులు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు, అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ జాబితాలోకి సూర్య కూడా చేరిపోయాడు. 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 17 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు 8 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే వారం కూడా పూర్తి అవ్వకముందే ఈ చిత్రానికి 1 కోటి 80 లక్షల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. అదే విధంగా తమిళనాడు లో ఈ చిత్రానికి 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కర్ణాటక నుండి 12 కోట్ల 50 లక్షలు, కేరళ నుండి 8 కోట్ల 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్లు, ఓవర్సీస్ నుండి 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 163 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 79 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని భాషలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రానికి 70 కోట్లకు జరిగింది , ఇప్పటికే 9 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఎంత లాభాలు వస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper