Kalki Movie: రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో భారీ రికార్డ్ లను క్రియేట్ చేస్తున్న కల్కి…

Kalki Movie: ట్రైలర్ రూపంలో గానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ల రూపంలో గానీ కొత్త రికార్డులకైతే తెర తీస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అమెరికాలో...

Written By: Gopi, Updated On : June 22, 2024 12:23 pm

Kalki Movie creating huge records in overseas before the release

Follow us on

Kalki Movie: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి ముందే ఇంతకుముందు సినిమాల రికార్డులను బ్రేక్ చేసి ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ రూపంలో గానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ల రూపంలో గానీ కొత్త రికార్డులకైతే తెర తీస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అమెరికాలో ఫ్రీ సేల్ ద్వారా 2 మిలియన్ల డాలర్లని వసూలు చేసింది.

ఇక సినిమా రిలీజ్ అవ్వక ముందే మొత్తం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 15 మిలియన్ల డాలర్లను వసూలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక 210 ఐమాక్స్ ల్లో ఆల్రెడీ ఈ షోస్ వేయడానికి షెడ్యూల్స్ కూడా చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తం గా ఈనెల 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలైతే భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఇది తెలుగు సినిమా అయినప్పటికీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమాని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Ranveer Singh: రన్వీర్ సింగ్ కి షాక్ ఇస్తున్న సౌత్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

అక్కడ హాలీవుడ్ సినిమాలకు ఏ రేంజ్ లో అయితే బుకింగ్స్ జరుగుతాయో ఒక తెలుగు సినిమాకి కూడా ఆ రేంజ్ లో బుకింగ్స్ జరగడం అనేది నిజంగా మన తెలుగు సినిమాలా స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిందనే చెప్పాలి. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఒక వండర్ ని క్రియేట్ చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ప్రభాస్ కూడా తనదైన రీతిలో ఒక సూపర్ సక్సెస్ అనేది తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Also Read: Vijay Birthday: బర్త్ డే బాయ్ తలపతి విజయ్ కోసం గోట్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్… మామూలుగా లేదుగా…

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మరొక రెండు మూడు రోజుల్లో ఓపెన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడ మాత్రం భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను వసూలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కూడా అంచనాలను అమాంతం పెంచేసింది. కాబట్టి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…