https://oktelugu.com/

Vijay Birthday: బర్త్ డే బాయ్ తలపతి విజయ్ కోసం గోట్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్… మామూలుగా లేదుగా…

విజయ్ బర్త్ డే సందర్భంగా 51 సెకండ్స్ తో ఉన్న ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఇక అందులో రౌడీలు విజయ్ ను తరుముతూ ఉంటే ఒక కారు చేజింగ్ సీన్ అయితే నడుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 09:30 AM IST

    Vijay Birthday

    Follow us on

    Vijay Birthday: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ తలపతి…ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపాయనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించే వెంకట్ ప్రభు కూడా ఈ సినిమాతో సక్సెస్ అయితే సాధించాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇక ఆయన ఇంతకుముందు నాగచైతన్యతో చేసిన కస్టడీ సినిమా ఫ్లాప్ అయింది. ఇక దాని నుంచి తేరుకోవడానికి పక్కాగా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అయితే సాధించాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విజయ్ బర్త్ డే సందర్భంగా 51 సెకండ్స్ తో ఉన్న ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఇక అందులో రౌడీలు విజయ్ ను తరుముతూ ఉంటే ఒక కారు చేజింగ్ సీన్ అయితే నడుస్తుంది. ఇక అందులో రౌడీలు విజయ్ పైన దాడి చేయాలని చూస్తున్న క్రమం లో విజయ్ స్లో మోషన్ షాట్ లో బైక్ మీద కట్ కొడతా ఉంటే మరొక విజయ్ రౌడీల మీదకి గన్ తో కాలుస్తూ ఉంటాడు.

    ఇక ఈ సినిమాలో ఇద్దరు విజయ్ లు ఉన్నారు అనే విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ ఈ చిన్న వీడియోలో ఇద్దరిని రివిల్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో ‘బర్త్ డే బాయ్ విజయ్’ కి విషెస్ ను తెలియజేసిన సినిమా యూనిట్ అతని ఫ్యాన్స్ కి మాత్రం ఒక హై మూమెంట్ అయితే ఇచ్చారనే చెప్పాలి…