https://oktelugu.com/

Gopichand Malineni: ఆ స్టార్ హీరో స్టోరీ తోనే సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్న గోపిచంద్ మలినేని…

Gopichand Malineni: ఇప్పుడు అసలు విషయం లోకి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ హీరోగా ఆయన ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 12:16 PM IST

    Gopichand Malineni Sunny Deol Movie

    Follow us on

    Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ మలినేని. 2023 వ సంవత్సరం సంక్రాంతి కనక గా బాలయ్య బాబు తో చేసిన వీర సింహా రెడ్డి సినిమా హిట్ అయినప్పటికి తను మరో సినిమా స్టార్ట్ చేయడానికి 18 నెలలు పట్టింది.ఇక ఇప్పుడు అసలు విషయం లోకి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ హీరోగా ఆయన ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

    అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంభందించిన పూజ కార్యక్రమాలను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఇంతకుముందు రవితేజ తో చేయాలనుకొని ముహూర్తం కూడా జరుపుకొని కొద్ది మేరకు షూటింగ్ జరిగిన తర్వాత బడ్జెట్ ప్రాబ్లం తో ఈ సినిమాని ఆపేశారు. ఇక అదే స్టోరీ తో ప్రస్తుతం గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అవ్వాలని గోపిచంద్ చేసే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

    Also Read: Ranveer Singh: రన్వీర్ సింగ్ కి షాక్ ఇస్తున్న సౌత్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

    ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ అందుకుంటే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. ఇక ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని రాబోయే రోజుల్లో బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి విజయాన్ని దక్కించుకుంటాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    Also Read: Vijay Birthday: బర్త్ డే బాయ్ తలపతి విజయ్ కోసం గోట్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్… మామూలుగా లేదుగా…

    ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రవితేజ ఒక భారీ సక్సెస్ ని మిస్ చేసుకున్న వాడు అవుతాడు. ఇక ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం… ఇక సన్నీ డియోల్ కూడా గత సంవత్సరం గదర్ 2 సినిమా తో భారీ సక్సెస్ ను అందుకున్నాడు.