https://oktelugu.com/

Ranveer Singh: రన్వీర్ సింగ్ కి షాక్ ఇస్తున్న సౌత్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

గత కొద్ది రోజుల క్రితం ఆయన రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 09:36 AM IST

    Ranveer Singh

    Follow us on

    Ranveer Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మన దర్శకులందరూ కూడా వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతుండటం అనేది ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి. ఇక తెలుగు లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ కూడా వాళ్ల వాళ్ల భాషల్లో సినిమాలు చేసి సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్ లో ఉన్న హీరోలను డైరెక్షన్ చేయడానికి చూస్తున్నారు.

    కొందరైతే దర్శకత్వం చేసి సక్సెస్ లను కూడా సాధిస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా అట్లీ లాంటి డైరెక్టర్ ఇప్పటికే షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో ‘జవాన్ ‘ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

    గత కొద్ది రోజుల క్రితం ఆయన రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి. ఇక దాంతో రన్వీర్ సింగ్ వేరే డైరెక్టర్ తో మరొక సినిమా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ కంటే ముందే రన్వీర్ సింగ్ కి మరొక సౌత్ డైరెక్టర్ కూడా షాక్ ఇచ్చాడు ఆయన ఎవరు అంటే శంకర్…

    ఈయన 2005లో తీసిన అపరిచితుడు సినిమాని రన్వీర్ సింగ్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టలెక్కలేదు. ఇక ఇలా ఇద్దరు సౌత్ డైరెక్టర్ల చేతిలో భారీ దెబ్బతిన్న రన్వీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…