Nag Ashwin And Deepika Padukone: బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone). ఒక నటిగా ఈమె అద్భుతం, కానీ ఈమధ్య కాలం లో ఈమె ప్రవర్తన చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు. తన స్థాయికి తగ్గట్టుగా అసలు ప్రవర్తించడం లేదు. ఎందుకో సౌత్ ఇండియన్ సినిమా అంటే ఆమె చాలా చిన్న చూపుతో చూస్తున్నట్టుగా అనిపించింది. మొన్న సందీప్ వంగ, నిన్న వైజయంతీ మూవీ బ్యానర్ మరియు నాగవంశీ ఆమె పై చూపించిన అసహనమే అందుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఉదయం వైజయంతీ మూవీ నుండి ఒక సంచలనమైన పోస్ట్ పడింది. కల్కి(Kalki 2898 AD) సీక్వెల్ లో దీపికా పదుకొనే ని తప్పిస్తున్నామని, ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ లో నటించాలంటే డెడికేషన్ ఉండాలని, అది ఆమెలో లేదు కాబట్టే ఆమెని ఈ సినిమా నుండి తొలగించాము అనే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ వేశారు.
ఇది నిన్న పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్ నుండి ప్రభాస్ అభిమానులు, బాలీవుడ్ నుండి దీపికా పదుకొనే అభిమానులు పెద్ద ఎత్తున్న నిన్న ట్విట్టర్ లో మాటల యుద్ధం జరిపారు. ఈ నేపథ్యం లో కల్కి దర్శకుడు నాగ అశ్విన్ ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక స్టోరీ మరో దుమారం రేపింది. ఆయన మాట్లాడుతూ ‘జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు..కానీ జరగబోయేది మాత్రం మన చేతుల్లోనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే దీని అర్థం ఏమిటి?, గతం లో దీపికా పదుకొనే ని మా సినిమాలో తీసుకొని తప్పు చేసాము, ఇప్పుడు దానిని మార్చలేము, కానీ సీక్వెల్ ఇంకా మా చేతుల్లోనే ఉంది కాబట్టి దీపికా పదుకొనే ని మా సినిమా నుండి పీకేశాము అంటూ పరోక్షంగా చెంప దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పినట్టే అనుకోవచ్చు.
ఇంతలా కల్కి నిర్మాతలకు, దర్శకుడికి కోపం రప్పించిందంటే, దీపికా పదుకొనే ఏమి చేసి ఉంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు. ఆమె పై ఫైర్ అవ్వడానికి కారణం, ఆమె గొంతెమ్మ కోరికలే. సినిమాలో నాకు రెమ్యూనరేషన్ లో లాభాల్లో 50 శాతం వాటాలు ఇవ్వడమే కాకుండా, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, మరియు ఇతర రైట్స్ లో కూడా భాగస్వామ్యం కావాలని, రోజుకి 5 గంటలు మాత్రమే పని చేస్తానని, నాతో పాటు వచ్చే స్టాఫ్ కి రాయల్ ట్రీట్మెంట్ ఇస్తూ, వాళ్ళ ఖర్చులు కూడా మీరే భరించాలని,ఇలా ఇష్టమొచ్చిన డిమాండ్స్ చేసిందట. సందీప్ వంగ స్పిరిట్ కూడా ఈమె ఇలాంటి డిమాండ్స్ పెట్టింది. ఆయన రియాక్షన్ ఎలా ఉన్నిందో మనం కళ్లారా చూసాము, ఇప్పుడు నాగ వంశీ నుండి కూడా అలాంటి రియాక్షన్ వచ్చింది.