Kalki 2898 AD Twitter review : కల్కి 2829 AD ట్విట్టర్ టాక్ : వరల్డ్ క్లాస్ విజువల్స్, అద్భుతం చేసిన నాగ్ అశ్విన్.. కానీ అదొక్కటే మైనస్!

kalki 2898 AD Twitter review అయితే కల్కి మూవీలో మైనస్ అంశాలు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఏమంత అద్భుతంగా లేదనేది కొందరు ఆడియన్స్ అభిప్రాయం. అలాగే మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ కాదు.

Written By: NARESH, Updated On : June 27, 2024 7:45 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD Twitter review : ఫైనల్లీ కల్కి 2829 AD థియేటర్స్ లోకి వచ్చేసింది. జూన్ 26 అర్ధరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మైథాలజి, సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి కల్కి కథ రాసుకోవడం విశేషం. గతంలో ఈ తరహా ప్రయోగం చేసిన దర్శకులు లేరు. అందుకే ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. అదే సమయంలో విజువల్స్ విషయంలో నాగ్ అశ్విన్ మెప్పించగలుగుతాడా? అనే సందేహం ఉంది. కారణం ఈ విషయంలో మనం హాలీవుడ్ కంటే చాలా వెనుకబడి ఉన్నాం.

ఇండియన్ సినిమా గ్రాఫిక్స్ సహజంగా ఉండవు. బడ్జెట్ పరిమితులు, ఉన్నత సాంకేతిక నిపుణులను మనం ఉపయోగించకపోవడం ఇందుకు కారణం. చివరికి రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-పులి ఫైట్ ఏమంత సహజంగా ఉండదు. చాలా దగ్గరగా రూపొందించేందుకు రాజమౌళి ట్రై చేశాడు. కాబట్టి పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ మూవీ విషయంలో విజువల్స్ విషయంలో మెప్పించడం అంత సులభం కాదు. అయితే నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. కల్కి చిత్రంలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇండియన్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారని అంటున్నారు.

ఇక నాగ్ అశ్విన్ రాసుకున్న కథ, పాత్రలు సినిమాకు హైలెట్. ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె నటన అద్భుతంగా ఉందనేది ఆడియన్స్ అభిప్రాయం. కాంప్లెక్స్ అనే ప్రపంచానికి వెళ్లాలనే యువకుడు భైరవగా ప్రభాస్ మెప్పించాడని, అమితాబ్, దీపికా పదుకొనె పాత్రలు చాలా బలంగా రాసుకున్నారని అంటున్నారు. మహాభారతాన్ని, కృష్ణుడు కల్కి అవతారంలో తిరిగి రావడం వంటి అంశాలతో సాగే కథ కొత్తగా అనిపిస్తుంది.

అయితే కల్కి మూవీలో మైనస్ అంశాలు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఏమంత అద్భుతంగా లేదనేది కొందరు ఆడియన్స్ అభిప్రాయం. అలాగే మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ అనుభవలేమి కనిపిస్తుందన్న మాట వినిపిస్తుంది. బలమైన కథను ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పే స్కోప్ ఉందని అంటున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలకు లాజిక్ ఉండదు. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చివరి 30 నిమిషాలు గొప్పగా మలిచాడు. అదిరిపోయే క్లైమాక్స్ కల్కి లో ఉందని అంటున్నారు. మొత్తంగా కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.