https://oktelugu.com/

Kalki 2898 AD Review : ‘కల్కి 2898 ఏడి’ ఫుల్ మూవీ రివ్యూ

Kalki 2898 AD Review ఇక విజువల్స్ అయితే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. అసలు ఆ విజువల్స్ చూసిన తర్వాత ఇది మన తెలుగు సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. ఇక ఈ సినిమా కి అవే చాలా వరకు ప్లస్ అయ్యాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 4, 2024 10:59 am
    kalki 2898 AD Movie review In Telugu

    kalki 2898 AD Movie review In Telugu

    Follow us on

    Kalki 2898 AD Review : ప్రభాస్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి.ఇక బాహుబలి2 తర్వాత ఆయన రేంజ్ అయితే విపరీతంగా పెరిగింది. పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగుతో పాటుగా బాలీవుడ్ అభిమానులు కూడా తన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఆయన ఎలాంటి స్టార్ట్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఈరోజు రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడి’ అనే సినిమా ఎలా ఉంది సక్సెస్ అయ్యిందా? లేదా? ప్రభాస్ కెరియర్ లో ఇది బాహుబలి తర్వాత మరొక భారీ హిట్ గా నిలుస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ చేసి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా కల్కి సినిమా కథ విషయానికి వస్తే ఈ భూమ్మీద కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి సమస్త సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించబోతున్నట్టుగా ఇంతకు ముందు మనం పురాణాల్లో తెలుసుకున్నాము. ఇక ఆ పురాణాలను బేస్ చేసుకొని నాగ్ అశ్విన్ ఈ కథని రాసుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కలి (కమలహాసన్) ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించాడు. భైరవ(ప్రభాస్) కల్కి కలిసి దాన్ని ఎలా అడ్డుకున్నారు. అతన్ని ఎలా అంతం చేశారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను నాగ్ అశ్విన్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా తెరకెక్కించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేస్తూ ముందుకు సాగుతుంది. విజువల్స్ పరంగా అయితే నాగ్ అశ్విన్ తీసుకున్న కేర్ చాలా బాగుంది. చాలా చోట్ల మనం ఒక వేరే వరల్డ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కల్కి సినిమా కథ పరంగా చూసుకుంటే ఇది మహాభారతాన్ని బేస్ చేసుకొని వచ్చిన కథ అయినప్పటికి ఇక విజువల్స్ పరంగా మాత్రం ఈ సినిమాను చాలా గ్రాండీయర్ గా చూపించాడు. తన మైండ్ లో ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద చూపించడం లో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

    ఇక భైరవ( ప్రభాస్) ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ గానీ, భైరవకి అశ్వద్ధామ(అమితాబచ్చన్) కి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు గాని ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయి… ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మూవీ లోని క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరి పాత్ర ను చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అందువల్లే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి అది చాలా బాగా హెల్ప్ అయింది. నిజానికి దీపిక పదుకునే సీన్స్ ను దర్శకుడు చాలా ఎమోషనల్ గా మార్చాడు. ఇక ఇందులో కొన్ని క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి.

    అయితే ఆ పాత్రలను ఎవరు చేశారు అనేది ఎవరికి వాళ్ళు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది…ఇక గ్రాఫిక్స్ వర్క్ బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అది గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఎపిసోడ్స్ కానీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ బోర్ లేకుండా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిసేపు బోర్ అనిపించినప్పటికీ నాగ్ అశ్విన్ మళ్ళీ తన మేకింగ్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ తీసుకువస్తాడు…

    ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్..

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ దీపిక పదుకునే అమితాబచ్చన్, కమలహాసన్ ఈ నలుగురు కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లోకి తీసుకెళ్ళారు. వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు అనేంతలా స్క్రీన్ మీద వాళ్ళు తమ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక ఈ సినిమాలో ఒక్కొక్కరి పాత్ర కి వాళ్ళు 100% న్యాయం చేశారు. వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు అనేది మాత్రం వాస్తవం…ఇక కమలహాసన్ చేసిన పాత్ర మాత్రం ఒక 50 సంవత్సరాల వరకు గుర్తుంటుంది. ఆయన నటించిన విధానం నిజంగా నెక్స్ట్ లెవల్… కమలహాసన్ అంటే ఇన్ని రోజులు ఒకలా ఉండేవారు కానీ ఇప్పుడు కంప్లీట్ వేరు.

    నటనలో అతన్ని కొట్టే వారు ఇండస్ట్రీ లో మరొకరు లేరు అనేది మరోసారి ప్రూవ్ చేశారు..ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్, కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే క్యారెక్టర్లు ఎవరి పాత్రలకి వాళ్ళు న్యాయం చేయడమే కాకుండా దర్శకుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ల పట్ల చాలా కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి…ఇక భైరవగా ప్రభాస్ ఇంతకుముందు ఎన్నడు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించాడు. ఇక అతని పాత్రకి 100 కి 100% న్యాయం చేశారనే చెప్పాలి. ఇక అమితాబచ్చన్ ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీన్స్ లో చాలా అద్భుతంగా చేస్తూనే తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక దీపిక పదుకొనే కూడా ఒక సెటిల్డ్ క్యారెక్టర్ ను ప్లే చేసింది.

    ఆమె ఇంతకు ముందు చేసిన అన్ని పాత్రల కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ పాత్ర కావడం ఆమె కి చాలా వరకు కలిసి వచ్చే అంశం. ఇక ఈ పాత్రలో తన పర్ఫామెన్స్ ని చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడని అక్కడి అభిమానులు చెబుతున్నారు. అందుకే ఆమె ఆ పాత్రలో జీవించేసిందని చెబుతున్నారు. ఇక అమితాబచ్చన్ కూడా అసలు ఈ ఏజ్ లో ఇంత యాక్టీవ్ గా ఉంటూ నటించడం అనేది నిజంగా గ్రేట్…

    టెక్నికల్ అంశాలు

    ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయింది. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. కాబట్టి ఈ సినిమాని కూడా సంతోష్ నారాయణన్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా ఎక్కడ తగ్గకుండా కథలోని ఎమోషన్స్ ను బ్యాలెన్స్ అయ్యేలా ముందుకు తీసుకెళ్లాడు.

    ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే వైజయంతి మూవీస్ వాళ్ళు అసలు ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా మార్చడానికి విపరీతంగా ఖర్చు పెట్టినట్టుగా కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది…ఇక విజువల్స్ అయితే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. అసలు ఆ విజువల్స్ చూసిన తర్వాత ఇది మన తెలుగు సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. ఇక ఈ సినిమా కి అవే చాలా వరకు ప్లస్ అయ్యాయి…

    ప్లస్ పాయింట్స్

    ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకునే లా యాక్టింగ్…
    స్టోరీ
    డైరెక్షన్
    విజువల్స్

    మైనస్ పాయింట్స్

    సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్లో అయింది…
    కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వర్క్ అంత పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు…

    రేటింగ్
    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి ఈ సినిమా ద్వారా ఒక భారీ సక్సెస్ అయితే దక్కుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పవచ్చు..

    Kalki 2898 AD Trailer - Telugu | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika | Nag Ashwin