Homeఎంటర్టైన్మెంట్Ileana: కాజల్ గర్భం ఇలియానికి ప్లస్ అయింది !

Ileana: కాజల్ గర్భం ఇలియానికి ప్లస్ అయింది !

Ileana: ఇలియానాకి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. పదేళ్ల క్రితం సౌత్ ప్రేక్షకులను.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గ్లామర్ హీరోయిన్స్ లో.. ముందు వరుసలో నిలిచే పేరు ‘ఇలియానా’ది. అయితే, ఇలియానా మళ్ళీ తెలుగు తెర పై దర్శనమివ్వడానికి సన్నద్ధం అవుతుంది. హిందీ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని.. తెలుగు సినిమాలను వదులుకుని ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళింది. అయితే, అక్కడ ఐటమ్ గర్ల్ గానే ఇలియానాకి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ అవకాశాలు […]

IleanaIleana: ఇలియానాకి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. పదేళ్ల క్రితం సౌత్ ప్రేక్షకులను.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గ్లామర్ హీరోయిన్స్ లో.. ముందు వరుసలో నిలిచే పేరు ‘ఇలియానా’ది. అయితే, ఇలియానా మళ్ళీ తెలుగు తెర పై దర్శనమివ్వడానికి సన్నద్ధం అవుతుంది. హిందీ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని.. తెలుగు సినిమాలను వదులుకుని ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళింది.

అయితే, అక్కడ ఐటమ్ గర్ల్ గానే ఇలియానాకి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా పెద్దగా రావట్లేదు. అందుకే, మళ్ళీ తెలుగు సినిమాల్లోకి వచ్చేయాలని ఇలియానా ఫిక్స్ అయింది. అయితే, కాజల్ గర్భం దాల్చడం ఇప్పుడు ఇలియానికి ప్లస్ అయింది. కాజల్ గర్భవతి కావడంతో ఇక చేసేది ఏమి లేక నాగార్జున సరసన నటించాల్సిన ‘ది ఘోస్ట్’ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.

ఇప్పుడు ఆమె స్థానంలో ఇలియానాను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలియానా కూడా ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక పీఆర్వో టీమ్ ను కూడా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇలియానా హీరోయిన్ గా నటించడానికి ఆసక్తిగా ఉంది, మీ సినిమాలో పెట్టుకోండి అంటూ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారును ఇలియానా టీమ్ అప్రోచ్ అయ్యారు.

కాజల్ ఎలాగూ నటించట్లేదు కాబట్టి.. ఆమె ప్లేస్ లో ఇలియానా అయితే బాగుంటుందని ప్రవీణ్ సత్తారు కూడా ఫీల్ అయ్యాడు. అయితే, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మరి నాగార్జున ఇలియానాకి ఓటేస్తాడా ? చూడాలి. తెలుగులో ఇలియానా చేసిన లాస్ట్ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. మరి నాగ్ సినిమాతోనైనా ఇలియానా హిట్ అందుకుంటుందేమో చూడాలి.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper