Ileana : ఇలియానా(ileana d’cruz)..ఈ పేరు వింటే యూత్ ఆడియన్స్ ఎలా మెంటలెక్కిపోయేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా. రామ్ పోతినేని మొదటి సినిమా ‘దేవదాస్’ తో ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఎలాంటి సునామీని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు, పురీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఆమె ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది, ఒక్క రామ్ చరణ్ తో తప్ప.
Also Read : రెండవసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటో!
అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు అడపాదడపా సక్సెస్ అయ్యాయి కానీ, ఎక్కువ శాతం ఫ్లాప్స్ గా నిలిచాయి. అలా ఆమె హిందీ లో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘రైడ్’. అజయ్ దేవగన్(Ajay Devagan) హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా రీసెంట్ గా ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో రీ మేక్ అయ్యి డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అయితే రైడ్ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఇలియానా, రీసెంట్ గా విడుదలైన ‘రైడ్ 2′(Raid 2 Movie) లో కూడా హీరోయిన్ గా నటిస్తుందని అందరు భావించారు. కానీ ఆమెకు బదులుగా వాణీ కపూర్ ని ఎంచుకున్నారు. దీనిపై బాలీవుడ్ లో పెద్ద చర్చనే నడిచింది. ఇలియానా ని కాకుండా వాణీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు గల కారణాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా.
ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ముందుగా ఇలియానా నే హీరోయిన్ గా ఎంచుకున్నాము. కానీ పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. తన భర్త, పుట్టిన బిడ్డతో కలిసి విదేశాల్లో జీవిస్తుంది. ఆమె ఆస్తులను కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంది. మేము ఈ సినిమా కోసం ఆమెని సంప్రదించినప్పుడు ఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పింది. దీంతో మేము వాణీ కపూర్ ని ఎంచుకున్నాము. సినిమాల్లో క్యాస్టింగ్ ని అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనల వల్ల మార్చాల్సి వస్తూ ఉంటుంది. ఇలా జరగడం కొత్తేమి కాదు. దీని వెనుక ఎలాంటి కాంట్రవర్సి లేదు. ఇలియానా తో పని చేయడం మాకు ఒక అద్భుతమైన అనుభూతి. ఆమె ఎప్పటికీ రైడ్ ప్రపంచంలో భాగమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : తెలుగులో ఫస్ట్ కోటి తీసుకున్న హీరోయిన్, పెళ్లి కాకుండానే గర్భం, కట్ చేస్తే… ఇండస్ట్రీ నుంచి అవుట్!