Manchu Vishnu : నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు మోహన్ బాబు. 500 వందలకు పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా పదుల సంధ్యలో చిత్రాలు నిర్మించారు. టాలీవుడ్ బడా కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే మోహన్ బాబు కుటుంబం విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతుంది. మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మనోజ్ వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్స్ పై ఫన్నీ, మీమ్ వీడియోలు చేయడం యూట్యూబ్ ఛానల్స్ కి పరిపాటిగా మారింది.
మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ ఆల్ట్రా డిజాస్టర్ అని చెప్పాలి. కనీసం పోస్టర్స్ చార్జెస్ కూడా రాలేదు. ఆ సినిమా అంతగా నిరాదరణకు గురి కావడానికి ట్రోలింగ్, నెగిటివ్ ప్రచారం అని మోహన్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అదే ఏడాది మంచు మనోజ్ జిన్నా పేరుతో ఓ చిత్రం చేశాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆడలేదు. కోటి రూపాయల వసూళ్లు కూడా రాలేదు. సన్నీ లియోన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా జిన్నా రికవరీ చేయలేదని ఎద్దేవా చేశారు. ట్రోలింగ్ జిన్నా ఫలితాన్ని సైతం దెబ్బ తీసిందని మంచు ఫ్యామిలీ అభిప్రాయపడింది.
Also Read : రేవంత్ రెడ్డి తో మోహన్ బాబు, విష్ణు కీలక భేటీ
ఈ క్రమంలో వారు కోర్టుకు వెళ్లారు. సోషల్ మీడియాలో తమపై జరిగే ట్రోలింగ్ ఆపివేయాలని, సదరు కంటెంట్ ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటీషన్ వేశారు. అసలు తమను ట్రోల్ చేయడానికి ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడి నుండే ఇది జరుగుతుంది. అది ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు తెలుసని విష్ణు అన్నాడు. తాజాగా ఆయన మరోసారి స్పందించారు. మా ఎన్నికల అనంతరం తమ కుటుంబం పై ట్రోలింగ్ ఎక్కువైందని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ కుటుంబాన్ని ట్రోల్ చేస్తే యూట్యూబ్ ఛానల్స్ కి వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తుంది. దాంతో తమను ట్రోల్ చేస్తున్నారు. మా ఎన్నికల అనంతరం ఇది ఎక్కువైంది. ఒక నిర్మాణాత్మక విమర్శను తీసుకుంటాము. అలాగే మేము పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము కాబట్టి మమ్మల్ని విమర్శిస్తే పర్లేదు. కుటుంబ సభ్యులను విమర్శించకూడదు కదా. అందుకే మేము కోర్టును ఆశ్రయించాము. ఒక సూపర్ స్టార్ కూతురిని, కోట శ్రీనివాసరావుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని, విష్ణు వెల్లడించారు.
ఇక కన్నప్ప మూవీ విషానికి వస్తే ఏప్రిల్ 25న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read : నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు