Homeఅత్యంత ప్రజాదరణSai Pallavi : లౌక్యం చూపించిన సాయి పల్లవి !

Sai Pallavi : లౌక్యం చూపించిన సాయి పల్లవి !

Sai PallaviSai Pallavi : క్రేజీ బ్యూటీ సాయి పల్లవి చాలా సైలెంట్. ఆమె ఆడియో ఫంక్షన్స్ లో పెద్దగా మాట్లాడదు. కానీ “లవ్ స్టోరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి చాలా ఓపెన్ గా మాట్లాడింది. సాయి పల్లవి నేనా ఇలా మాట్లాడుతుంది అన్నట్టు చూసారు ఆమె సన్నిహితులు. బయట కూడా పెద్దగా స్పీచ్ లు ఇవ్వడానికి ఇష్టపడని ఆమె, ఈ సారి ఎందుకు ఇంత సుదీర్ఘంగా మాట్లాడింది అంటూ ఆలోచనలో పడ్డారు.

ఇంతకీ సాయి పల్లవి ఏమి మాట్లాడింది అంటే.. సాయి పల్లవి మాటల్లోనే.. ‘చిరంజీవి గారి సినిమాల్లో డ్యాన్స్ లు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. అలాంటిది, ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి గొప్పగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు.

కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడు మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు. నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ములగారు నన్ను నమ్మడమే.. నాకు పెద్ద బ్లెస్సింగ్. ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పనిచేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది.

అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో వెంటనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నాగచైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది’ అంటూ సాయి పల్లవి స్పీచ్ సాగింది. మొత్తానికి సాయిపల్లవి కూడా బాగానే లౌక్యం చూపిస్తుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular