
ప్రధాని మోదీ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ అతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో పాల్గొననున్నారు. అలాగే అమెరికా ఉపాధక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్, ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. మోదీ సెప్టెంబర్ 22న అమెరికా రాజధాని వాషింగ్టన్ కు చేరుకోనున్నారు.
ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలతో సమావేశం కానున్నారు. వారిలో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. అలాగే కమలా హారిస్ తోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని యోసియిడే సుగాతో సమావేశం కానున్నారు.
ఇదిలా ఉండగా. మోదీ బైడెన్ మధ్య అఫ్గానిస్థాన్ పరిణామాలు, కొవిడ్ వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్ ఉగ్రవాదం వంటి పలు అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే పర్యటనలో చివరి రోజున యూఎస్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించనున్నారు. మార్చిలో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ప్రధాని వెళ్తోన్న తొలి పర్యటన.