Kajal Aggarwal: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్(Kajal Agarwal). ఆమె పేరు తీస్తే చాలు వేరెక్కి పోయే కుర్రాళ్లు లక్షల్లో ఉంటారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్, పెళ్లి తర్వాత బాగా డౌన్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల్లో నటించడానికి ఆమె సిద్దంగానే ఉంది, కానీ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు పెద్దగా ఇవ్వడం లేదు. ఇచ్చిన వాళ్ళు కూడా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను సినిమాల నుండి తొలగించి కాజల్ కి అన్యాయం చేస్తున్నారు. చిరంజీవి(Megastar Chiranjeevi), రామ్ చరణ్(Global Star Ram Charan) కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రం లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెపై చాలా సన్నివేశాలు చిత్రీకరణ కూడా జరిపారు.
Also Read: బంపర్ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..మరో నేషనల్ అవార్డు గ్యారంటీ!
కానీ ఆమె పాత్ర కథకు అడ్డంగా ఉందని ఎడిటింగ్ లో సినిమా నుండే తొలగించేసారు. కాజల్ అగర్వాల్ పాపం అందుకు ఫీల్ అయ్యింది కూడా. రీసెంట్ గానే ఆమె సల్మాన్ ఖాన్(Salman Khan) ‘సికిందర్’ మూవీ లో ఒక కీలక పాత్ర పోషించింది. అయితే రీసెంట్ గానే సినిమా లో తొలగించిన ఒక సన్నివేశాన్ని మూవీ టీం యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ఆ తొలగించిన సన్నివేశం కాజల్ అగర్వాల్ దే. సన్నివేశం ఏమిటంటే సంకుచిత భావాలు గల మామగారు, అలాగే భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక కాజల్ అగర్వాల్ అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఆమెని రక్షిస్తాడు. ఆ తర్వాత కాజల్ కి జీవితం ఎంత విలువైనదో వివరిస్తూ, ఆమె అత్తా మామల ఆలోచన విధానం ని కూడా మార్చే విధంగా ఎన్నో గొప్ప మాటలు చెప్తాడు. ఈ సన్నివేశం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది.
సల్మాన్ ఖాన్ నటన కూడా ఈ సన్నివేశం లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అలాంటి మంచి సన్నివేశాన్ని, నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండే సన్నివేశాన్ని తొలగించడానికి మనసు ఎలా వచ్చింది అంటూ డైరెక్టర్ AR మురుగదాస్ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి మంచి సన్నివేశాలన్నీ తొలగించి, చెత్త సన్నివేశాలను జోడించి, సినిమాని దరిద్రం గా ఎడిటింగ్ చేశారు, అందుకే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది, అది కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ స్టేటస్ వల్ల వచ్చిన వసూళ్లు మాత్రమే. సినిమా స్క్రీన్ ప్లే, కథనం మాత్రం చాలా చెత్తగా వచ్చిందంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది.