Jr.NTR-Prashanth Neel : ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై రోజురోజుకి అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ సాధారణమైన డైరెక్టర్ తో పని చేస్తేనే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ఒక ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో పని చేస్తే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. డైరెక్టర్ కి అతి పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే, ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాని తీయడం. కాస్త అటు ఇటు అయినా బాక్స్ ఆఫీస్ ఫలితం తారుమారు అవుతుంది. అందుకే ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తానూ తీసిన సినిమాలన్నిటికంటే ఈ చిత్రాన్ని ఇంకా భారీ గా తెరకెక్కిస్తున్నాడట. రీసెంట్ గానే ఎన్టీఆర్ కూడా మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కుంటా అనే ప్రాంతంలో పది కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన సెట్ లో జరుగుతుందట.
Also Read : రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి..?
విశాలమైన ఈ సెట్ లో ఒక రైల్వే స్టేషన్ సెట్, హెలిప్యాడ్ సెట్, అప్పటి తరానికి సంబంధించిన ఇళ్ల సెట్స్, భారీ తుపాకీలు, యుద్ధ ట్యాంకర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చిన్న సైజు ప్రపంచాన్నే సృష్టించేసాడు. కేజీఎఫ్, సలార్ చిత్రాల మాదిరిగానే, ఈ సినిమా కూడా చూసే ఆడియన్స్ కి సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుందట. అయితే కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగానే సెట్స్ ఉంటాయి కానీ, సినిమాలో చూపించే సన్నివేశాలు మాత్రం యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తుండగా, ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ కూడా అయిపోయింది.
ఇకపోతే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడట. ప్రతీ రోజు మూడు గంటల పాటు కఠోరమైన వర్కౌట్స్ చేస్తూ, కేవలం ప్రోటీన్ డైట్ ని మాత్రమే తీసుకునేవాడట. సాధారణంగానే భోజన ప్రియుడైన ఎన్టీఆర్, తన డైట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇంత సన్నబడడం మామూలు విషయం కాదు. యమదొంగ చిత్రం నుండి ఇదే మైంటైన్ చేస్తూ వస్తున్నాడు కానీ. ‘దేవర’ షూటింగ్ కి ముందు కాస్త లావు అయ్యాడు. ‘దేవర’ తర్వాత మళ్ళీ చిక్కిపోయాడు. హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో ఆయన చేస్తున్న ‘వార్ 2’ కోసం సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచాడు. ఇలా ప్రతీ సినిమా కోసం తన శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు మార్చుకుంటూ ఫిట్నెస్ ఫ్రీక్స్ ని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన నటించిన ‘వార్ 2’ మూవీ ఆగస్టు లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది.
Also Read : బాలయ్య చేయాల్సిన సినిమాను చిరంజీవి ఎందుకు చేశాడు..?