Hit3 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit: The Third Case) మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ట్రేడ్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. ప్రతీ సమ్మర్ కి క్రేజీ సినిమాలతో, హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడే థియేటర్స్, ఈ సమ్మర్ లో మాత్రం సరైన సినిమాలు విడుదల లేక బోసిపోయాయి. కుదేలు అయిపోయిన తెలుగు సినీ పరిశ్రమకు తమిళ అనువాద చిత్రాలే దిక్కు అయ్యాయి. సింగల్ స్క్రీన్స్ అయితే అత్యధిక చోట్ల క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ ‘హిట్ 3’ తో రీ ఓపెనింగ్ కాబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొదలు అవ్వగా, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కచ్చితంగా నాని కెరీర్ లో నెంబర్ 1 ఓపెనర్ గా ఈ చిత్రం నిలవబోతుంది.
Also Read : ఎన్టీఆర్ కోసం హెలికాప్టర్ నుండి వార్ ట్యాంకర్లు తెప్పించిన ప్రశాంత్ నీల్..!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇటీవలే కాశ్మీర్ ప్రాంతం లోని పెహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 28 మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల భారత దేశం లోని ప్రతీ పౌరుడు ఆవేశం తో రగిలిపోతున్నారు. ప్రతి పక్షం, అధికార పక్షం ఏకమైపోయింది. ఉగ్రవాద చర్యలకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి భారత సైన్యం సన్నాహాలు చేస్తుంది. ఇలాంటి క్రమం లో సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించిన సన్నివేశాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలో చిత్రీకరించాడట. ఈ సినిమా పూర్తి అయ్యి దాదాపుగా రెండు నెలలు గడుస్తుంది. అయినప్పటికీ ఆ ఘటనతో పోలిన సన్నివేశాన్ని చిత్రీకరించడం గమనార్హం. శైలేష్ కొలను కి ఇది కొత్తేమి కాదు.
‘హిట్ : ది ఫస్ట్ కేస్’ తీసినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఆయనకు ఎదురైంది. దిశా ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. ఈ ఘటన జరగకముందే అదే కాన్సెప్ట్ తో శైలేష్ ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ తీసాడు. సెకండ్ కేస్ తీస్తున్నప్పుడు కూడా అదే తరహా అనుభవం ఎదురైంది. ఇప్పుడు మూడవ సారి కూడా అలాంటి ఘటన జరగడం చూస్తుంటే, భారతదేశ ప్రభుత్వం ఇతను ‘హిట్ 4’ స్క్రిప్ట్ సిద్ధం చేసినప్పుడు కచ్చితంగా ఇతన్ని పిలిపించి మాట్లాడే ఆవశ్యకత వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన రాసే స్క్రిప్ట్స్ భవిష్యత్తులో జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని, రీసెంట్ గానే నిర్మాతగా కూడా ‘కోర్ట్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా, హీరో గా ‘హిట్ 3 ‘ తో మరో సక్సెస్ ని అందుకుంటాడా లేదో చూడాలి.
Also Read : హీరో విశ్వక్ సేన్ తో వివాదం గురించి నాని సంచలన వ్యాఖ్యలు!